నన్ను దోచుకొందువటే...
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి...
నన్ను దోచుకొందువటే ...
చరణం : 1
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూలదండ వోలె కర్పూర కళికవోలె... కర్పూర కళికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు... సంకెలలు వేసినావు
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి...
నన్ను దోచుకొందువటే ...
చరణం : 2
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలిసి పోదు నీలో... కలిసి పోదు నీలో
ఏనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఏనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం... ఇగిరిపోని గంధం
నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి...
నన్ను దోచుకొందువటే ...
చిత్రం : గులేబకావళి కథ (1962)
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం : వి.కృష్ణమూర్తి, జోసెఫ్
గానం : ఘంటసాల, పి.సుశీల
No comments:
Post a Comment