Wednesday, March 16, 2011

Dham (2003) - 1

పాట- 1
పల్లవి :

చల్లగాలికి చెప్పాలనివుందిమన కథ ఈవేళ

చందమామకు చెప్పాలనివుంది సరసకు రావేలా

వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలని

తోడుగవుండి మనసంతా నిండీ నడిపించే జతని

చల్లగాలికి చెప్పాలనివుంది మన కథ ఈవేళ

చరణం : 1

నువ్వున్నది నాకోసం నేనే నీకోసంలా

నిలిచేది మన ప్రేమలా

నువులేని ప్రతి నిమిషం ఎదలో ఒక గాయంలా

కరిగే ఈ కన్నీటిలా

మనసున ఇంద్రజాలమే ఈ ప్రేమ పరువపు పూలవానలే

ఇరువురి వలపు వంతెనే ఈ ప్రేమ సకలం ప్రేమ సొంతమే

చల్లగాలికి చెప్పాలనివుంది మన కథ ఈవేళ

చందమామకు చెప్పాలనివుంది సరసకు రావేలా

చరణం : 2

ఆ... నిపపద గరిమగరిస... ఆ...

నిదురంటూ మటుమాయం కుదురంటూ కరువే

ప్రతి గమకం సంగీతమే

ప్రతి ఊహ ఒక కావ్యం ప్రతి ఊసు మైకం

ప్రతి చూపు పులకింతలే

చెదరని ఇంద్రధనసులే ఈ ప్రేమ తొలకరి వానజల్లులే

కరగని పండు వెన్నెలే ఈ ప్రేమ కలిగిన వేళ హాయిలే

చల్లగాలికి చెప్పాలనివుంది మన కథ ఈవేళ

చందమామకు చెప్పాలనివుంది సరసకు రావేలా

వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలని

తోడుగవుండి మనసంతా నిండీ నడిపించే జతని

చల్లగాలికి చెప్పాలనివుంది మన కథ ఈవేళ

చందమామకు చెప్పాలనివుంది సరసకు రావేలా


చిత్రం : ధమ్ (2003)

రచన : సురేంద్రకృష్ణ

సంగీతం : రమణగోగుల

గానం : హరిహరన్, నందిత

No comments:

Post a Comment