ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
చరణం : 1
పతిదేవుని మురిపించే వలపుల వీణ
జీవితమే పండించే నవ్వుల వాన
కష్ట సుఖాలలో తోడు నీడగా
తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ
కష్ట సుఖాలలో తోడు నీడగా
తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ
మగువేగా మగవానికి మధుర భావన
ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
చరణం : 2
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
తనయుని వీరునిగ పెంచే తల్లిగ
సతియే గృహసీమను గాంచే దేవతగా
సతియే గృహసీమను గాంచే దేవతగా
సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా
ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి
చిత్రం : దేవత (1965)
రచన : వీటూరి
గానం : ఘంటసాల
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
----
పాట - 2
పల్లవి :
తొలి వలపే పదే పదే పిలిచే... ఎదలో సందడి చేసే
తొలి వలపే పదే పదే పిలిచే... మదిలో మల్లెలు విరిసే
తొలి వలపే... ఏ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ...
చరణం : 1
ఏమో ఇది ఏమో
నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం అనుబంధం
నా మనసున మీకై దాచిన పూచిన కానుకలు
నీ కనుల వెలిగెనే దీపాలు
అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు
నీ కనుల వెలిగెనే దీపాలు
అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు
మన అనురాగానికి హారతులు
తొలి వలపే పదే పదే పిలిచే... ఎదలో సందడి చేసే
తొలి వలపే...
గరి నిరిగా.. ఆ...
మగ రిగమా.. ఆ...
గమ నీదనీద పా.. ఆ...
చరణం : 2
ఏలా... ఈ వేళ కడువింతగ తోచే
తీయగ హాయిగ ఈ జగము
యవ్వనమూ అనుభవమూ జతగూడిన వేళా
కలిగిన వలపుల పరవశ ము
ఏలా... ఈ వేళ కడువింతగ తోచే
తీయగ హాయిగ ఈ జగము
యవ్వనమూ అనుభవమూ జతగూడిన వేళా
కలిగిన వలపుల పరవశ ము
ఈ రేయి పలికెలే స్వాగతము
ఈనాడే బ్రతుకున శుభదినము
ఈ రేయి పలికెలే స్వాగతము
ఈనాడే బ్రతుకున శుభదినము
ఈ తనువే మనకిక చెరిసగము
తొలి వలపే పదే పదే పిలిచే... ఎదలో సందడి చేసే
తొలి వలపే పదే పదే పిలిచే... మదిలో మల్లెలు విరిసే
తొలి వలపే...
చిత్రం : దేవత (1965)
రచన : వీటూరి
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : ఘంటసాల,పి.సుశీల
----
పాట - 3
పల్లవి :
బ్రతుకంత బాధగా కలలోని గాధగా
కన్నీటిధారగా కరిగిపోయె
తలచేది జరుగదు జరిగేది తెలియదు
బొమ్మను చేసి ప్రాణము పోసి... ఆడేవు నీకిది వేడుకా
గారడిచేసి గుండెను కోసి
నవ్వేవు ఈ వింత చాలిక
చరణం : 1
అందాలు సృష్టించినావు దయతో నీవు
మరల నీ చేతితో నీవే తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావె
గాఢాంధకారాన విడిచేవులే
కొండంత ఆశ అడియాశ చేసి
కొండంత ఆశ అడియాశ చేసి
పాతాళ లోకాన తోసేవులే
చరణం : 2
ఒకనాటి ఉద్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
ఒకనాటి ఉద్యానవనము నేడు కనము
అదియే మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగ మధువు అందించి నీవు
హాలాహల జ్వాల చేసేవులే
ఆనందనౌక పయనించువేళ
ఆనందనౌక పయనించువేళ
శోకాల సంద్రాన ముంచేవులే
గారడిచేసి గుండెను కోసి
నవ్వేవు ఈ వింత చాలిక
బొమ్మను చేసి ప్రాణము పోసి... ఆడేవు నీకిది వేడుకా
చిత్రం : దేవత (1965)
రచన : పల్లవి-వీటూరి, చరణాలు-శ్రీశ్రీ
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : ఘంటసాల
----
పాట - 4
పల్లవి :
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు
కమ్మని నీ పోజు కవ్వించే ఈ రోజు
మథనపడి మనసుచెడి వచ్చానే అమ్మాయి
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
ఏమిటి నీగాథ ఏమాత్రం నీహోదా
ఏమిటి నీగాథ ఏమాత్రం నీహోదా
ఆ విషయం ఆ వివరం చెప్పవోయి అబ్బాయి
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
చరణం : 1
రోడ్లమీద కార్లున్నాయ్ బ్యాంకులో డబ్బులున్నాయ్
రోడ్లమీద కార్లున్నాయ్ బ్యాంకులో డబ్బులున్నాయ్
దేవుడిచ్చిన కాళ్ళున్నాయ్ చూడ్డానికి కళ్ళున్నాయ్
మన బింకం మన పొంకం తెలిసిందా అమ్మాయి
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
క్యాడిలా కారుందా న్యూ మోడల్ మేడుందా
క్యాడిలా కారుందా న్యూ మోడల్ మేడుందా
ఇంటిముందు లానుందా నిదురబోను ఫ్యానుందా
కాఫీలకు సినిమాలకు కరువేమీ లేదుకదా
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
చరణం : 2
ఊరు తిరగ బస్సుంది ప... పాఁయ్ ప... పాఁయ్
ఉండను ప్లాట్ఫారముంది
ఊరు తిరగ బస్సుంది... ఉండను ప్లాట్ఫారముంది
కడుపునిండా నీరుత్రాగ కార్పొరేషన్ టాపుంది
ఏమున్నా లేకున్నా... ఏమున్నా లేకున్నా...
మిన్నయైనదొకటుంది... మిన్నయైనదొకటుంది...
ఏముంది ప్రేమించే హృదయముంది
అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి... అహా...
అదే నాకు కావాలి ఇతడె నన్ను ఏలాలి
అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి
అబ్బాయిని అమ్మాయిని ఇద్దరినే కనాలి
హ్యాపీగా తాపీగా... హ్యాపీగా తాపీగా...
బ్రతుకు పరుగు తీయాలి... బ్రతుకు పరుగు తీయాలి...
మా ఊరు మదరాసు నా పేరు రాందాసు
మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి
చిత్రం : దేవత (1965)
రచన : కొసరాజు
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : పద్మనాభం, ఎల్.ఆర్.ఈశ్వరి
----
పాట - 5
పల్లవి :
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు
నీ చూపుతో నన్ను ముడివేయకు
చరణం : 1
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నాపైట చెంగులాగి కవ్వించకు
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నాపైట చెంగులాగి కవ్వించకు
అనువైన వేళ అందాలు దాచకు
అనువైన వేళ అందాలు దాచకు
అణువణువు నిన్నే కోరే మురిపించకు
ఇకనైన నును సిగ్గు తెరవేయకూ
నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
చరణం : 2
ఎటుచూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మోహాలతో నన్ను మంత్రించకు
ఎటుచూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మోహాలతో నన్ను మంత్రించకు
మనలోని ప్రేమ మారాకు వేయనీ
మనలోని ప్రేమ మారాకు వేయనీ
మనసార ఒడిలో నన్ను నిదురించనీ
నీ నీలి ముంగురులు సవరించనీ
నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
చిత్రం : దేవత (1965)
రచన : వీటూరి
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
గానం : ఘంటసాల, పి.సుశీల
No comments:
Post a Comment