Wednesday, March 30, 2011

Intinti ramayanam (1979) - 2

పాట - 1
రాజన్ నాగేంద్ర
పల్లవి:

వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ...తీగ రాగమైన మధురిమ కన్నావా

తనువు తహతహలాడాల చెలరేగాల

చెలి ఊగాల ఉయ్యూలలీవేళలో

వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ... తీగ రాగమైన మధురిమ కన్నావా

చరణం : 1

ఊపిరి తగిలిన వేళనే వంపులు తిరిగిన వేళ

నా వీణలో నీ వేణువే పలికే రాగమాల

ఆ... ఆ... లలలా... ఆ...

చూపులు రగిలిన వేళ ఆ చుక్కలు వెలిగిన వేళ

నా తనువున అణువణువున జరిగే రాసలీల

వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ... తీగ రాగమైన మధురిమ కన్నావా

చరణం : 2

ఎదలో అందం ఎదుట ఎదుటే వలచిన వనిత

నీ రాకతో నా తోటలో వెలసే వనదేవత

ఆ... ఆ... లలలా... ఆ...

కదిలే అందం కవిత అది కౌగిలికొస్తే యువత

నా పాటలో నీ పల్లవే నవతా నవ్య మమతా

వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ... తీగ రాగమైన మధురిమ కన్నావా

తనువు తహతహలాడాల చెలరేగాల

చెలి ఊగాల ఉయ్యూలలీవేళలో

వీణ వేణువైన సరిగమ విన్నావా

ఓ... తీగ రాగమైన మధురిమ కన్నావా


చిత్రం : ఇంటింటి రామాయణం (1979)

రచన : వేటూరి

సంగీతం : రాజన్-నాగేంద్ర

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

----

పాట - 2

పల్లవి :

మల్లెలుపూసే... వెన్నెల కాసే... ఈ రేయి హాయిగా...

మల్లెలుపూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

మల్లెలుపూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

మల్లెలుపూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

చరణం : 1

ముసిముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలిమోజులే నీ విరజాజులై

ముసిముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలిమోజులే నీ విరజాజులై

మిసమిస వన్నెలలో మిలమిల మన్నవిలే నీ బిగికౌగిలిలో జాబిలి రాత్రులే

కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే

మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

మల్లెలుపూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

చరణం : 2

ఆహా... ఆ... ఆహా... హా... ఆ...

తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా

తొలకరి కోరికలే తొందర చేసినవే ఈ విరిశయ్యకే ఆవిరి తీరగా

సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే ఏ తెరచాటునో ఆ చెర వీడగా

అందిన పొందులోనె అందలేని విందులీయవే

కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

మల్లెలుపూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా

మల్లెలుపూసే వెన్నెల కాసే... ఈ రేయి హాయిగా...


చిత్రం : ఇంటింటి రామాయణం (1979)

రచన : వేటూరి

సంగీతం : రాజన్-నాగేంద్ర

గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

No comments:

Post a Comment