Friday, March 18, 2011

Geetanjali (1989) - 5

పాట - 1
పల్లవి :

ఆమనీ పాడవే హాయిగా...

మూగవైపోకు ఈ వేళా

రాలేటి పూలా రాగాలతో

పూసేటి పూలా గంధాలతో

మంచు తాకి కోయిలా... మౌనమైన వేళలా

ఆమనీ పాడవే హాయిగా...

ఆమనీ పాడవే హాయిగా...

చరణం: 1

వయస్సులో వసంతమే... ఉషస్సులా జ్వలించగా

మనస్సులో నిరాశలే... రచించెలే మరీచికా

పదాల నా ఎదా... స్వరాల సంపదా

తరాల నా కథా... క్షణాలదే కదా

గతించిపోవు గాథ నేననీ!

ఆమనీ పాడవే హాయిగా...

మూగవైపోకు ఈ వేళా

రాలేటి పూలా రాగాలతో

చరణం: 2

శుకాలతో పికాలతో... ధ్వనించినా మధూదయం

దివీ భువీ కలా నిజం... స్పృశించినా మహోదయం

మరో ప్రపంచమే... మరింత చేరువై

నివాళి కోరినా... ఉగాది వేళలో

గతించిపోని గాథ నేననీ!

ఆమనీ పాడవే హాయిగా...

మూగవైపోకు ఈ వేళా

రాలేటి పూలా రాగాలతో

పూసేటి పూలా గంధాలతో

మంచు తాకి కోయిలా... మౌనమైన వేళలా

ఆమనీ పాడవే హాయిగా...


చిత్రం : గీతాంజలి (1989)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గా నం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 2

పల్లవి :

జల్లంత కవ్వింత కావిలిలే

ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే

జల్లంత కవ్వింత కావిలిలే

ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే

ఉరుకులో పరుగులో

ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు

తొలకరి మెరుపులా

ఉలికిపడిన కలికి సొగసు

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే

ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే

ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

చరణం : 1

వాగులు వంకలు జలజలా చిలిపిగా పిలిచినా

గాలులు వానలు చిటపటా చినుకులే చిలికినా

మనసు ఆగదు ఇదేమి అల్లరో

తనువు దాగదు అదేమి తాకిడో

కోనచాటు కొండమల్లే లేనివంక ముద్దులాడి

వెల్లడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి

జల్లంత కవ్వింత కావిలిలే

ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే

జల్లంత కవ్వింత కావిలిలే

ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే

ఉరుకులో పరుగులో

ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు

తొలకరి మెరుపులా

ఉలికిపడిన కలికి సొగసు

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే

ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే

ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

చరణం : 2

సందెలో రంగులే నొసటిపై తిలకమే నిలుపగా

తెలి తెలి వయసులే తెలియని తపనలే తెలుపగా

వానదేవుడే కళ్ళాపి జల్లగా

వాయుదేవుడే ముగ్గేసి వెళ్ళగా

నీలిమంట గుండెలోని ఊసులన్ని తెలుసుకున్న

కొత్త పాట పుట్టుకొచ్చె ఎవరికోసమో

జల్లంత కవ్వింత కావిలిలే

ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే

జల్లంత కవ్వింత కావిలిలే

ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే

ఉరుకులో పరుగులో

ఉడుకు వయసు దుడుకుతనం నిలువదు

తొలకరి మెరుపులా

ఉలికిపడిన కలికి సొగసు

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే

ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే

కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే

ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే


చిత్రం : గీతాంజలి (1989)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : చిత్ర

----

పాట - 3

పల్లవి :

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

ఏల గాలి మేడలూ... రాలు పూల దండలు

నీదో లోకం... నాదో లోకం

నింగీ నేల తాకేదెలాగ!

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

ఏల గాలి మాటలూ... మాసిపోవు ఆశలూ

నింగీ నేల తాకే వేళ

నీవే నేనై పోయే వేళాయె

నేడు కాదులే... రేపు లేదులే

వీడుకోలిదే... వీడుకోలిదే

చరణం : 1

నిప్పులోన కాలదూ నీటిలోన నానదూ

గాలిలాగ మారదూ ప్రేమ సత్యమూ

రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నమూ

పేదవాడి కంటిలో ప్రేమ ర క్తమూ

గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో

జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో

ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకూ

రాజశాసనాలకీ లొంగిపోవు ప్రేమలూ

సవాలుగా తీసుకో ఓయీ ప్రేమా

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

చరణం : 2

కాళిదాసు గీతికీ కృష్ణ రాసలీలకీ

ప్రణయమూర్తి రాధకీ ప్రేమపల్లవీ

ఆ అనారు ఆశకీ తాజ్మహల్ శోభకీ

పేదవాడి ప్రేమకీ చావు పల్లకీ

నిధి కన్న ఎద మిన్న గెలిపించు ప్రేమనే

కథ కాదు బ్రతుకంటే బలికాని ప్రేమనే

వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా

పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా

జయించేది ఒక్కటే ఓయీ ప్రేమా

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

ఓ ప్రియా ప్రియా... నా ప్రియా ప్రియా...

కాలమన్న ప్రేయసీ తీర్చమందిలే కసీ

నింగీ నేల తాకే వేళ నీవే నేనై పోయే క్షణాన

లేదు శాసనం లేదు బంధనం

ప్రేమకే జయం ప్రేమదే జయం


చిత్రం : గీతాంజలి (1989)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు చిత్ర

----

పాట - 4

పల్లవి :

ఓం నమహ నయన శృతులకు

ఓం నమహ హృదయ లయలకు ఓం

ఓం నమహ అధర జతులకు ఓం

నమహ మధుర స్మృతులకు ఓం

నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో

ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

చరణం : 1

రేగిన కోరికలతో గాలులు వీచగా

జీవన వేణువులతో మోహన పాడగా

దూరము లేనిదై లోకము తోచగా

కాలము లేనిదై గగనము అందగా

సూరిడే ఒదిగి ఒదిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా

మద్దుల సద్దుకే నిదుర లేపే ప్రణయ గీతికి ఓం

చరణం : 2

ఒంటరి బాటసారి జంటకు చేరగా

కంటికి పాపవైతే మారవా

తూరుపు నీవుగా వేకువ నేనుగా

అల్లిక పాటగా పల్లవి ప్రేమగా

ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే

జగతికే అతిథులై జననమందిన ప్రేమ జంటకి

ఓం నమహ నయన శృతులకు

ఓం నమహ హృదయ లయలకు ఓం

ఓం నమహ అధర జతులకు ఓం

నమహ మధుర స్మృతులకు ఓం

నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలో

ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో

చిత్రం : గీతాంజలి (1989)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

---

పాట - 5

పల్లవి :

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా...

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా...

ఓ పాప లాలీ...

చరణం : 1

నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా...

నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరికా...

కలలారని పసిపాప తల వాల్చిన ఒడిలో

తడి నీడలు పడనీకే ఆ దేవత గుడిలో

చిరు చేపల కనుపాపలకిది నా మనవి...

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా...

ఓ పాప లాలీ...

చరణం : 2

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి

గాలిలో... తేలిపో... వెళ్ళిపో...

ఓ... కోయిల పాడవే నా పాటని

తీయని... తేనెలే... చల్లిపో

ఇరు సంధ్యలు కదలాడే ఎద ఊయల ఒడిలో

సెలయేరుల అల పాటే వినిపించని గదిలో

చలి ఎండకు సిరివెన్నెలకిది నా మనవి...

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా...

ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా...

ఓ పాప లాలీ...


చిత్రం : గీతాంజలి (1989)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment