Monday, March 14, 2011

Boys (2003) - 1

పాట - 1
పల్లవి :

ఎగిరి దుమికితే నింగి తగిలెను

పదములు రెండూ పక్షులాయెను

వేళ్ల చివర పూలు పూచెను

కనుబొమ్మలే దిగి మీసమాయెను

అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె

ఆనంద బాష్పాల్లో మునిగా...

ఒక్కొక్క పంటితో నవ్వా...

కలకండ మోసుకుంటూ నడిచా ఒక చీమై

నే నీళ్ళల్లో పైపైనే నడిచా ఒక ఆకై...

అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె

అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె

ప్రేవును చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే

గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ...

ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే

గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ...

ఎగిరి దుమికితే నింగి తగిలెను

పదములు రెండూ పక్షులాయెను

వేళ్ల చివర పూలు పూచెను

కనుబొమ్మలే దిగి మీసమాయెను

అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె

అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె

చరణం : 1

నరములలో మెరుపురికెరినులే

తనువంతా వెన్నెలాయెనులే

చందురుని నువు తాకగనే

తారకలా నే చెదిరితినే

మనసున మొలకే మొలిచెను

అది కరువై తలనే దాటలే.. అలె.. అలె..

నే చలనం లేని కొలనుని

ఒక కప్ప దూకగా ఎండితిని

ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే

గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ...

ఎగిరి దుమికితే నింగి తగిలెను

పదములు రెండూ పక్షులాయెను

వేళ్ల చివర పూలు పూచెను

కనుబొమలే దిగి మీసమాయెను

అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె

అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె

చరణం : 2

ఇసకంతా ఇక చక్కెరయా

కడలంతా మరి మంచినీరా..

తీరమంతా నీ కాలిగుర్తులా

అలలన్నీ నీ చిరునవ్వులా..

కాగితం నాపై ఎగరగ

అది కవితల పుస్తకమాయెనులే.. అలె.. అలె..

హరివిల్లు తగులుతూ ఎగరగ...

ఈ కాకి కూడా నెమలిగా మారెనులే

ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే

గాలై ఎగిరెను మనసే... ఓ ఓ ఓ...

ఎగిరి దుమికితే నింగి తగిలెను

పదములు రెండూ పక్షులాయెను

వేళ్ల చివర పూలు పూచెను

కనుబొమ్మలే దిగి మీసమాయెను

అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె

అలె... అలె... అలె... అలె... అలెఅలెఅలెఅలెఅలెఅలెఅలె

ప్రేమను చెప్పిన క్షణమే అది దేవున్ని కన్న క్షణమే

గాలై ఎగిరెను మనసే...

చిత్రం : బాయ్స్ (2003)

రచన : ఎ.ఎం.రత్నం

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

గానం : కార్తీక్, చిత్ర, శివరామన్

No comments:

Post a Comment