![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhk_Yv5_2EBAGTWEYpHBBwkqwiAwXuJTtOmoHFyJEzZmDlfQAVp4CPA2VBA0TK2SsfkR61DWQYXZHfYs4bA8bCqB7lkoJANAv3Xz34IrACTsePsJFr9UYbz4vKmTasKuFHIoHPY4TEPkVrk/s200/bhakta-tukaram.jpg)
పల్లవి :
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
అది పిలుపో మేలుకొలుపో నీ పిలుపో మేలుకొలుపో
అది మధుర మధుర మధురమౌ ఓంకారమో
పాండురంగ... పాండురంగ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
చరణం : 1
ప్రాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
పాభాత మంగళపూజావేళ
నీ పద సన్నిధి నిలబడి... నీ పదపీఠిక తలనిడి
నిఖిల జగతి నివాళులిడదా... నిఖిల జగతి నివాళులిడదా
వేడదా... కొనియాడదా... పాండురంగ... పాండురంగ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
చరణం : 2
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే
గిరులూ ఝరులూ విరులూ తరులూ
నిరతము నీ పాద ధ్యానమే... నిరతము నీ నామ గానమే
సకల చరాచర లోకేశ్వరేశ్వరా... సకల చరాచర లోకేశ్వరేశ్వరా
కరా... భవహరా...పాండురంగ... పాండురంగ...
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
ఘనాఘన సుందరా కరుణా రసమందిరా
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
పాండురంగ... పాండురంగ... పాండురంగ... పాండురంగ...
చిత్రం : భక్త తుకారాం (1973)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : పి.ఆదినారాయణరావు
గానం : ఘంటసాల
----
సాకీ :
ఆ... నందన వనముగ ఈ లోకమునే సృష్టించిన
ఓ... వనమాలీ! మరచితివో మానవజాతిని దయమాలి
పల్లవి :
బలే బలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు
చరణం : 1
మాటలు రాని మృగాలు సైతం
మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మానరజాతి
మారణహోమం సాగించేను
మనిషే పెరిగి మనసే తరిగి
మనిషే పెరిగి మనసే తరిగి
మమతే మరచాడు మానవుడు
నీవేల మార్చవు...
బలే బలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు
చరణం : 2
ఆ... ఆ... ఆ... ఆ.....
చల్లగ సాగే సెలయేటివోలే
మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే గువ్వలవోలే
అందరు ఒక్కటై నివసించాలి
స్వార్థం మానుకొని సమతే పెంచుకొని
స్వార్థం మానుకొని సమతే పెంచుకొని
మంచిగ మానవుడే మాధవుడై
మహిలోన నిలవాలి...
బలే బలే అందాలు సృష్టించావు
ఇలా మురిపించావు అదే ఆనందం
అదే అనుబంధం ప్రభో మాకేల ఈయవు
బలే బలే అందాలు సృష్టించావు
చిత్రం : భక్త తుకారాం (1973)
రచన : వీటూరి
సంగీతం : పి.ఆదినారాయణరావు
గానం : ఘంటసాల
No comments:
Post a Comment