
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపోయే వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా
ఆరాటాలే ఎగసి అణువు అణువు తడిసి
ఇంకా ఇంకా బిగిసింది ప్రేమా...
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
చరణం :
అనుకోకుండా నీ ఎద నిండా పొంగింది ఈ ప్రేమ
అనుకోకుండా నీ బ్రతుకంతా నిండింది ఈ ప్రేమ
అనుకోని అతిథిని పొమ్మంటూ తరిమే అధికారం లేదమ్మా
స్వార్థంలేని త్యాగాలనే చేసేదే ఈ ప్రేమ
త్యాగంలోనా ఆనందాన్నే చూసేదే ఈ ప్రేమ
ఆనందం బదులు బాధే కలిగించే ఆ త్యాగం అవసరమా
ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక
మరుపంటూ రానే రాదమ్మా
ఓసారి కలగన్నాక ఊహల్లో కలిసున్నాక
విడిపోయే వీలే లేదమ్మా
నీ కళ్ళల్లోనా కన్నీటి జల్లుల్లోనా
ముత్యంలాగ మెరిసి సత్యాలెన్నో తెలిపి
ముందుకు నిన్నే నడిపింది ప్రేమా
చితం : ఆంధ్రుడు (2005)
రచన : చంద్రబోస్
సంగీతం : కళ్యాణి మాలిక్
గానం : కె.కె.
No comments:
Post a Comment