Saturday, March 12, 2011

Bhagya rekha (1957) - 1

పాట - 1

పల్లవి :

నీవుండేదా కొండపై నా స్వామి

నేనుండేదీ నేలపై

ఏ లీల సేవింతునో... ఏ పూల పూజింతునో

చరణం : 1

శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె

ఈ పేదరాలి మనస్సెంతో వేచె

శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె

ఈ పేదరాలి మనస్సెంతో వేచె

నీ పాద సేవా మహాభాగ్యమీవా

నా పైని దయజూపవా... నా స్వామి

నీవుండేదా కొండపై నా స్వామి

నేనుండేదీ నేలపై

ఏ లీల సేవింతునో... ఏ పూల పూజింతునో

చరణం : 2

దూరాననైన కనే భాగ్యమీవా

నీ రూపు నాలో సదా నిల్వనీవా

ఏడుకొండలపైనా వీడైన స్వామి

నా పైని దయజూపవా.. నా స్వామి

నీవుండేదా కొండపై నా స్వామి

నేనుండేదీ నేలపై

ఏ లీల సేవింతునో... ఏ పూల పూజింతునో


చిత్రం : భాగ్యరేఖ (1957)

రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : పి.సుశీల

No comments:

Post a Comment