Saturday, March 19, 2011

Gooduputani (1972) - 1

పాట - 1
పల్లవి :

తనివి తీరలేదే నా మనసు నిండలేదే

ఏనాటి బంధమీ అనురాగం

తనివి తీరలేదే నా మనసు నిండలేదే

ఏనాటి బంధమీ అనురాగం

చెలియా... ఓ.. ఓ చెలియా... ఓ.. ఆ..

చరణం : 1

ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలూగామే

ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలలూగామే

ఎన్నో పున్నమి రాత్రులలో

వెన్నెల జలకాలాడామే

అందని అందాలా అంచుకే చేరిననూ

అందని అందాలా అంచుకే చేరిననూ

విరిసినా పరువాలా లోతులే చూసిననూ

తనివి తీరలేదే నా మనసు నిండలేదే

ఏనాటి బంధమీ అనురాగం

తనివి తీరలేదే నా మనసు నిండలేదే

ఏనాటి బంధమీ అనురాగం

ప్రియతమా... ఓ ప్రియతమా...

చరణం : 2

ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి

ఎప్పుడు నీవే నాతో ఉంటే ఎన్ని వసంతాలైతేనేమి

కన్నుల నీవే కనబడుతుంటే

ఎన్ని పున్నమలు వస్తేనేమి

వెచ్చనీ కౌగిలిలో హాయిగా కరిగించిననూ

వెచ్చనీ కౌగిలిలో హాయిగా కరిగించిననూ

తీయనీ హృదయంలో తేనెలే కురిపించిననూ

తనివి తీరలేదే నా మనసు నిండలేదే

ఏనాటి బంధమీ అనురాగం


చిత్రం : గూడుపుఠాణి (1972)

రచన : దాశరథి

సంగీతం : ఎస్.పి.కోదండపాణి

గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

No comments:

Post a Comment