Wednesday, March 16, 2011

Dance master (1989) - 1

పాట - 1

పల్లవి :

రానేలా వసంతాలే శ్రుతి కానేలా సరాగాలే

నీవేనా నా జీవనరాగం స్వరాల బంధం

నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం

రానేలా వసంతాలే...

చరణం : 1

ఈ మౌన పంజరాన నీ మూగనై

నీ వేణువూదగానే నీ రాగమై

ఎగిరే శోకమై విరిసే తోటనై

ఏ పాట పాడినా అది పూవులై

అవి నేల రాలిన చిరుతావినై

పదుైనె ననేమి ఆశలారిబోతి

రానేలా వసంతాలే...

చరణం : 2

ఓ ప్రేమిక చెలియా ఒడి చేరవా

ఈ చెలిమిని ఇపుడే దరిజేర్చవా

రగిలే తాపమే ఎదలో తీరగా

నీ చూపుతోనే చలి తీరగా

నీ స్పర్శతోనే మది పాడగా

ఎదమీటి పోయే ప్రేమగీతిలాగ

రానేలా వసంతాలే శ్రుతి కానేలా సరాగాలే

నీవేనా నా జీవనరాగం స్వరాల బంధం

నీదేనా యవ్వన కావ్యం స్మరించే గీతం

రానేలా వసంతాలే శ్రుతి కానేలా సరాగాలే


చిత్రం : డాన్స్‌మాస్టర్ (1989)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : చిత్ర

No comments:

Post a Comment