Tuesday, March 15, 2011

Chettu kinda pleader (1989) - 1

పాట - 1
పల్లవి :

అల్లి బిల్లి కలలా రావే అల్లుకున్న కథలా రావే

మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకే రావే

వేచే ఎదలో వెలుగై రావే

అల్లి బిల్లి కలలా రానా ఆహా... అల్లుకున్న కథలా రానా ఆహా...

మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకే రానా

వేచే ఎదలో వెలుగై రానా

అల్లి బిల్లి కలలా రావే... ఆహాఅల్లుకున్న కథలా రావే... ఆహా

అల్లి బిల్లి కలలా...

చరణం : 1

సోగకళ్ల విరిసే సొగసే గోగుపూలు కురిసే

రాగమైన పిలుపే తెలిపే మూగ గుండె వలపే

రెప్పచాటు చూపే నేడు రెక్కలొచ్చి ఎగిసే

నిన్న కన్న కలలే నేడు నిన్ను కోరి నిలిచే

ఏల బిగువా ఏలుకొనవా ప్రేమకథ వినవా

అల్లి బిల్లి కలలా రానా ఆహా... అల్లుకున్న కథలా రానా ఆహా...

అల్లి బిల్లి కలలా...

చరణం : 2

జావలీలు పాడే జాణ జాబిల్లమ్మ తానై

గుండె నిండిపోయే చానా వెండిమబ్బు తానై

సంగతేదో తెలిపే తలపే సంగతులు పలికే

దూరమింక చెరిపే వలపే దూర నవ్వు చినుకే

మేనికులుకే తేనె చినుకై పూలజల్లు కురిసే

అల్లి బిల్లి కలలా రావే... ఆహా అల్లుకున్న కథలా రావే... ఆహా

అల్లి బిల్లి కలలా రానా ఆహా... అల్లుకున్న కథలా రానా ఆహా...

మల్లెపూల చినుకై రానా పల్లవించు పలుకే రానా

వేచే ఎదలో వెలుగై రానా

అల్లి బిల్లి కలలా రావే... అల్లి బిల్లి కలలా రానా

అల్లి బిల్లి కలలా ...


చిత్రం : చెట్టు కింద ప్లీడరు (1989)

రచన : వెన్నెలకంటి

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, చిత్ర

No comments:

Post a Comment