Tuesday, March 15, 2011

Chirutha (2007) - 1

పాట - 1
పల్లవి :

ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే

గుండెలో ఎంత గట్టిగా గుచ్చావే

మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే

ఇంతలో కళ్ళ ముందుకేవచ్చావే

నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే

లవ్‌లో పడిపోయానే మేరీ ప్యారీ మెహబూబా

నడిచే నెలవంక చూస్తే నీవంక నిదరే రాదింక ఆ...

నో నో అనుకుంటూనే స్లోగా చెడిపోయానే

లవ్‌లో పడిపోయానే మేరీ ప్యారీ మెహబూబా

నడిచే నెలవంక చూస్తే నీవంక నిదరే రాదింక ఆ...

లైలా జర దిల్ దే లైలా... లైలా మేరీ దిల్ మే కోయిల

చరణం : 1

ఇంత గొప్ప అదృష్టం వెంటపడివస్తుందా

అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపోనా

పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం

నన్నిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా

పులిలావున్నోణ్ణి పిల్లిలా అయిపోయా నన్నిలా మార్చేసింది పిల్లా నువ్వేనే హో

కలలే కంటున్నా కలలో ఉంటున్నా ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే

నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే

నిన్నే ప్రేమించానే చూడకుండా ఉండలేనే

లైలా జర దిల్ దే లైలా... లైలా మేరీ దిల్ మే కోయిల

చరణం : 2

అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే

అప్పుడే బాగుండే దే అట ఇప్పుడు లేదే

ఊఁ అంటే కోపాలు కాదంటే శాపాలు

ఓలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు

బూరిబుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి

తొక్కలో బిల్డప్పిస్తే వేగేదెలాగే

ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా

నువ్విలా చేస్తూ ఉంటే రాదా చిరాకే

నీకై పడిచచ్చానే నీకే మనసిచ్చానే

నిన్నే ప్రేమించానే పద్ధతింక మార్చుకోవే

లైలా జర దిల్ దే లైలా... లైలా మేరీ దిల్ మే కోయిల


చిత్రం : చిరుత (2007)

రచన : భాస్కరభట్ల

సంగీతం : మణిశర్మ

గానం : కారుణ్య, బృందం

No comments:

Post a Comment