Monday, March 14, 2011

Bhairava dweepam (1994) - 2

పాట - 1

పల్లవి :

నరుడా ఓ నరుడా ఏమి కోరిక

నరుడా ఓ నరుడా ఏమి కోరిక

కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా

కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా

నరుడా ఓ నరుడా ఏమి కోరిక

చరణం : 1

రా దొరా ఒడి వలపుల చెరసాలరా

లే వరా ఇవి దొరకని సరసాలురా

దోర దొంగ సోకులేవి దోచుకో సఖా

రుతువే వసంతమై పువ్వులు విసరగా

ఎదలే పెదవులై సుధలే కొసరగా

ఇంత పంతమేల బాలకా

నరుడా ఓ నరుడా ఏమి కోరిక

కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా

నరుడా ఓ నరుడా ఏమి కోరిక

చరణం : 2

నా గిలి నిను అడిగెను తొలి కౌగిలి

నీ కసి స్వరమెరుగని ఒక జావళి

లేత లేత వన్నెలన్నీ వె న్నెలేనయా

రగిలే వయసులో రసికత నాదిరా

పగలే మనసులో మసకలు కమ్మెరా

ఇంత బింకమేల బాలకా

నరుడా ఓ నరుడా ఏమి కోరిక

నరుడా ఓ నరుడా ఏమి కోరిక

కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా

కోరుకో కోరి చేరుకో చేరి ఏలుకో బాలకా

నరుడా ఓ నరుడా ఏమి కోరిక

నరుడా ఓ నరుడా ఏమి కోరిక


చిత్రం : భైరవద్వీపం (1994)

రచన : వేటూరి

సంగీతం : మాధవపెద్ది సురేష్

గానం :ఎస్.జానకి

----

పాట - 2

పల్లవి :

ఆ ఆ ఆ... ఆ... ఆ.....

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

మనసే మందారమై వయసే మకరందమై

అదేదో మాయచేసినది

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం : 1

ఝుమ్మంది నాదం రతివేదం

జతకోరే భ్రమర రాగం

రమ్మంది మోహం ఒక దాహం

మరులూరే భ్రమల మైకం

పరువాల వాహిని ప్రవహించే ఈవని

ప్రభవించె ఆమని పులకించె కామిని

వసంతుడై చెలికాంతుడై... దరి చేరె మెల్లగా...

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

చరణం : 2

ఋతువుమహిమేమో విరితేనె

జడివానై కురిసె తీయగా

లతలు పెనవేయ మైమరిచి

మురిసేనూ తరువు హాయిగా

రాచిలుక పాడగా రాయంచ ఆడగా

రసలీల తోడుగా తనువెల్ల ఊగగా

మారుడె సుకుమారుడై.... జతకూడె మాయగా...

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా

మనసే మందారమై వయసే మకరందమై

అదేదో మాయచేసినది

విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా


చిత్రం : భైరవద్వీపం (1994)

రచన : సింగీతం శ్రీనివాసరావు

సంగీతం : మాధవపెద్ది సురేష్

గానం : కె.ఎస్.చిత్ర

No comments:

Post a Comment