Tuesday, March 15, 2011

Chitti chellelu (1970) - 1

పాట - 1
పల్లవి :

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది

ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది

ఏవేవొ కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి

ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

చరణం : 1

పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళు కలలే పండగా

పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళు కలలే పండగా

చిన్నారి చెలియ అపరంజి కలువ

చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవొ కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి

ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి

చరణం : 2

ఆ.. ఆ.. ఆ...

పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాట లాడగా

పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాట లాడగా

నిను చేరుకోగ నును మేని తీగ

పులకించి పోయెను తొలకరి వలపుల

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది

ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది

చరణం : 3

ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో

ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో

నిను నన్ను కలిపె నీ నీడ నిలిపె

అనురాగ సీమల అంచులు దొరికే

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది

ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది


చిత్రం : చిట్టిచెల్లెలు (1970)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

No comments:

Post a Comment