Saturday, March 19, 2011

Godavari (2006) - 4

పాట - 1

పల్లవి :

మనసావాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా

ఆ మాట దాచా కాలలు వేచా నడి చానే నీ నీడలా

మనసావాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

చరణం : 1

చిన్ని తప్పు అని చిత్తగించమని అన్నా వినదు

అప్పుడెప్పడొ నిన్ను చూసి నీ వసమై మనసు

కన్నీరైన గౌతిమికన్న తెల్లారైన పున్నమికన్న

మూగైపోయా నీనిలా...

మనసావాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

చరణం : 2

నిన్న నాదిగా నేడు కాదుగా అనిపిస్తున్నా

కన్ను చీకటై కలలు వెన్నెలై కాటైస్తున్నా

గతమేదైనా స్వాగతమననా నీ జతలోనే బ్రతుకనుకోనా

రాముని కోసం సీతలా...

మనసావాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా

నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా

ఆ మాట దాచా కాలలు వేచా నడి చానే నీ నీడలా

మనసావాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా


చిత్రం : గోదావరి (2006)

రచన : వేటూరి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

గానం : ఉన్నికృష్ణన్, చిత్ర

----

పాట - 2

పల్లవి :

నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ...

మధురవదన నళిననయన మనవి వినరా రామా

రామ చక్కని సీతకి అరచేత గోరింట

ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంట

రామ చక్కని సీతకి...

చరణం : 1

ఉడుత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే

ఎడమ చేతను శివుడి విల్లును ఎత్తిన ఆ రాముడే

ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో

రామ చక్కని సీతకి...

చరణం : 2

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే

చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పి

నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు

రామ చక్కని సీతకి...

చరణం : 3

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా

నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచే

చూసుకోమని మనసు తెల్పి మనసు మాటలు కాదుగా

రామ చక్కని సీతకి అరచేత గోరింట

ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో మొగుడంట

ఇందువదన కుందరదన మందగమన భామా

ఎందువలన ఇందువదన ఇంతమధన... ప్రేమా...


చిత్రం : గోదావరి (2006)

రచన : వేటూరి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

గానం : గాయత్రి

----

పాట - 3

సాకీ :

షడ్జమాం భవతి వేదం

పంచమాం భవతి నాదం

శృతిశిఖరే నిగమఝరే స్వరలహరే

సాసపాపపప పమరిససనిస

సాసపాపపప పమదపప

సాసపాపపప పమరిససనిస

సాసపాపపప పమనిదప

పల్లవి :

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి

శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి

వేసెయ్ చాప దోసెయ్ నావ బార్‌సెయ్ వాలుగా

చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీదేగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

చరణం : 1

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం

వేసే అట్ల్లు వేయంగానే లాభసాటి బేరం

ఇళ్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం

ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం

ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ

నది ఊరేగింపులో పడవ మీద రాగా

ప్రభువు తాను కాగా...

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

చరణం : 2

గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు

లంకానాథుడింకా ఆగనంటు పండ్లు కొరుకు

చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి

సందేహాల వుబ్బేపట్టె చూసే కంటికి

లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు

అల పాపికొండల నలుపు కడగలేక

నవ్వు తనకు రాగా...

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

వెతలు తీర్చు మా దేవేరి వేదమటి మా గోదారి

శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి

వేసెయ్ చాప దోసెయ్ నావ బార్‌సెయ్ వాలుగా

చుక్కానే చూపుగా బ్రతుకుతెరువు ఎదురీదేగా

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి


చిత్రం : గోదావరి (2006)

రచన : వేటూరి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

----

పాట - 4

పల్లవి :

అందంగా లేనా అసలేం బాలేనా అంత లేవలేంటో నీకు

అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా

అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా

అలుసైపోయానా అసలేమీ కానా వేషాలు చాల్లే పొవ్మునా

అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా

చరణం : 1

కనులు కలపవాయె మనసు తెలుపవాయె పెదవి కదపవాయె మాటవరసకే

కలికి చిలకనాయె కలత నిదురలాయె వురవలేక నిన్నే మదనపడితినే

ఉట్టుట్టిగా చూసి ఉడికించనేల నువ్వొచ్చి అడగాలి అన్నట్టు ఈ బెట్టు చేశాను ఇన్నాళ్లుగా

అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా

చరణం : 2

నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడే నచ్చా కనుల కబురు తెచ్చా తెలుసు నీకది

తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటనలేలనే

వెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను తరగల్లె నురగల్లె ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా

అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా

అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా

అలుసైపోయానా అసలేమీ కానా వేషాలు చాల్లే పొవ్మునా

అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా


చిత్రం : గోదావరి (2006)

రచన : వేటూరి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

గానం : సునీత

No comments:

Post a Comment