Monday, March 21, 2011

Gorintaku (1979) - 2

పాట - 1

పల్లవి :

కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి

ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం

ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం

కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి

మనసులో ధ్యానం మాటలో మౌనం

మనసులో ధ్యానం మాటలో మౌనం

చరణం : 1

మనసు మాటకందనినాడు మధురమైన పాటవుతుంది

మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది

మనసు మాటకందనినాడు మధురమైన పాటవుతుంది

మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుంది

పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతను చూడు

పల్లవించు పడుచుదనం పరుచుకున్న మమతను చూడు

పసితనాల తొలివేకువలో మసురుకున్న మబ్బును చూడు

అందుకే ధ్యానం అందుకే మౌనం

కొమ్మ కొమ్మకో సన్నాయి...

చరణం : 2

కొంటె వయసు కోరికలాగ గోదారి ఉరకలు చూడు

ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు

కొంటె వయసు కోరికలాగ గోదారి ఉరకలు చూడు

ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు

ఒడ్డుతోనో నీటితోనో పడవి ముడిపడి ఉండాలి

ఒడ్డుతోనో నీటితోనో పడవి ముడిపడి ఉండాలి

ఎప్పుడే ముడి ఎవరితో పడి పడవ పయనం సాగునో మరి

అందుకే ధ్యానం అందుకే మౌనం

అందుకే ధ్యానం అందుకే మౌనం

కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి

ఏమిటీ మౌనం ఎందుకీ ధ్యానం

మనసులో ధ్యానం మాటలో మౌనం

కొమ్మ కొమ్మకో సన్నాయి...


చిత్రం : గోరింటాకు (1979)

రచన : వేటూరి

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

గోరింట పూచింది కొమ్మలేకుండా

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

గోరింట పూచింది కొమ్మలేకుండా

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

ఎంచక్కా పండిన ఎరన్రి చుక్క

చిట్టీపేరంటానికి శ్రీరామరక్ష

కన్నెపేరంటాలికి కలకాలం రక్ష

గోరింట పూచింది కొమ్మలేకుండా

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

చరణం : 1

మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు

మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు

మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు

మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు

సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు

తానెరుపు అమ్మాయి తనవారిలోన

గోరింట పూచింది కొమ్మలేకుండా

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

చరణం : 2

మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు

గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు

మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు

గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు

సిందూరంలా పూస్తే చిట్టి చేయంతా

అందాల చందమామ అతనే దిగివస్తాడు

గోరింట పూచింది కొమ్మలేకుండా

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది

పడకూడదమ్మా పాపాయిమీద

పాపిష్టి కళ్ళు, కోపిష్టి కళ్ళు

పాపిష్టి కళ్ళల్లో పచ్చాకామెర్లు

కోపిష్టి కళ్ళల్లో కొరివీమంటల్లు


చిత్రం : గోరింటాకు (1979)

రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : పి.సుశీల


No comments:

Post a Comment