Saturday, March 12, 2011

Bhadrachalam (2001) - 1

పాట- 1

పల్లవి :

ఒకటే జననం ఒకటే మరణం

ఒకటే గమనం ఒకటే గమ్యం

గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు

బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు

కష్టాలురానీ కన్నీళ్లురానీ ఏమైనాగానీ ఎదురేదిరానీ

ఓడిపోవద్దు రాజీపడొద్దు నిద్రే నీకొద్దు నీకేది హద్దు

ఒకటే జననం ఒకటే మరణం

ఒకటే గమనం ఒకటే గమ్యం

గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు

బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు

చరణం : 1

రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి

ఆ గెలుపూ చప్పట్లే గుండెలలో మోగాలి

నీ నుదిటి రేఖలపై సంతకమే చేస్తున్నా

ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా

నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం

నమ్మకమే మనకున్న బలం

నీలికళ్లలో మెరుపే మెరవాలి

కారు చీకట్లో దారి వెతకాలి

గాలివానల్లో ఉరుమై సాగాలి

తగిలే గాయాల్లో థ్యేయం చూడాలి

ఒకటే జననం ఒకటే మరణం

ఒకటే గమనం ఒకటే గమ్యం

గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు

బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు

చరణం : 2

నిదరోక నిలుచుంటా వెన్నెలలో చెట్టువలె

నీకోసం వేచుంటా కన్నీటి బొట్టువలె

అడుగ డుగు నీ గుండె గడియారం నేనవుతా

నువు నడిచే దారులలో ఎదురొచ్చి శుభమవుతా

రాశిగ పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా

చేతులు చాచిన స్నేహంలా

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది

పట్టుకున్నావా పాటే అవుతుంది

అల్లుకున్నావా జల్లే అవుతుంది

హత్తుకున్నావా వెల్లువౌతుంది

ఒకటే జననం ఒకటే మరణం

ఒకటే గమనం ఒకటే గమ్యం

గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు

బ్రతుకు అంటె గెలుపూ గెలుపు కొరకె బ్రతుకు


చిత్రం : భద్రాచలం (2001)

రచన : సుద్దాల అశోక్‌తేజ

సంగీతం : వందేమాతరం శ్రీనివాస్

గానం : శంకర్‌మహదేవన్, చిత్ర


No comments:

Post a Comment