Friday, March 18, 2011

Geetha (1973) - 1

పాట - 1
సత్యం
పల్లవి :

ఓహోహో... ఏ... హే... ఎహే...

పూచే పూలలోనా వీచే గాలిలోనా

నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే...

పూచే పూలలోనా వీచే గాలిలోనా

నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే...

ఓ చెలీ... ఓ చెలీ...

చరణం : 1

నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు

నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు

నా ఊపిరై నీవు నాలోన సాగేవు

నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే

నీవు నా సర్వమే నీవు నా స్వర్గమే

నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే...

పూచే పూలలోనా వీచే గాలిలోనా

నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే...

ఓ చెలీ... ఓ చెలీ....

చరణం : 2

ఎన్నో జన్మల బంధము మనది

ఎవ్వరు ఏమన్నా ఇది వీడనది

నీవు నా గానమే నీవు నా ధ్యానమే

నీవు నా గానమే నీవు నా ధ్యానమే

నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే...

పూచే పూలలోనా వీచే గాలిలోనా

నీ అందమే దాగెనే... నీ అందెలే మోగెనే...

ఓ చెలీ... ఓ చెలీ...


చిత్రం : గీత (1973)

రచన : జి.కె.మూర్తి

సంగీతం : సత్యం

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment