Thursday, March 31, 2011

Jajimalli (2007) - 1

పాట - 1
పల్లవి :

ఎక్కడ బడితే అక్కడే నువు కనబడుతూవుంటే

రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూవుందే

ఎక్కడ బడితే అక్కడే నువు కనబడుతూవుంటే

రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూవుందే

కంటికి ఎదురుగ ఎవరున్నా నీరూపాన్నే చూస్తున్నా

ఒంటిగ ఎక్కడ నిలుచున్నా నీతలపుల్లో నే ఉన్నా

వలపులు వలదని మనసే అంటున్నా

కన్ను మిన్నే నిన్నేలే చూడాలంటుందే

నిన్ను నాలో నాలోనే దాచాలంటుందే

ఎక్కడ బడితే అక్కడే నువు కనబడుతూవుంటే

రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూవుందే

చరణం : 1

పుస్తకాలు చదివానే ప్రేమచెరితలెన్నో విన్నానే

ప్రేమజంటలను కలిశానే

ఈ ప్రేమమహిమలేంటో అడిగానే

ప్రేమంటే సముద్రమన్నారొకరు

ప్రేమంటే అమృతమన్నారింకొకరు

ఆ లోతుకు దూకాలనిపించే ఈ తీపిని చూడాలనిపించే

ముప్పులు తప్పక తప్పవని తెలిసీ

కన్ను మిన్నే నిన్నేలే చూడాలంటుందే

నిన్ను నాలో నాలోనే దాచాలంటుందే

ఎక్కడ బడితే అక్కడే నువు కనబడుతూవుంటే

రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూవుందే

చరణం : 2

అనుభవజ్ఞులను కలిశానే నా గుండె బాధ అంతా చెప్పానే

సైకాలిజిస్ట్‌లను కలిశానే ఉత్తరాలు కూడ రాశానే

నీ మనసుకు మార్గం జ్ఞానం అన్నారొకరు

నీ వయసుకు భారం తప్పదఉ అన్నారింకొకరు

అనునిత్యం జ్ఞానం చేస్తున్నా ఎదమోయని భారం మోస్తున్నా

తిప్పలు తప్పక తప్పవని తెలసీ

కన్ను మిన్నే నిన్నేలే చూడాలంటుందే

నిన్ను నాలో నాలోనే దాచాలంటుందే

ఎక్కడ బడితే అక్కడే నువు కనబడుతూవుంటే

రెక్కలు విప్పిన చప్పుడై మది తడబడుతూవుందే


చిత్రం : జాజిమల్లి (2007)

రచన : పైడిశెట్టి రామ్

సంగీతం : బేరి ఉమా మహేష్

గానం : మల్లికార్జున్

No comments:

Post a Comment