Tuesday, March 29, 2011

illalu (1981) - 1

పాట - 1
పల్లవి :

ఓ బాటసారి ఇది జీవిత రహదారి

ఓ బాటసారి ఇది జీవిత రహదారి

ఎంతదూరమో ఏది అంతమో

ఎవరూ ఎరుగని దారి ఇది

ఒకరికి సొంతం కాదు ఇది

ఓ బాటసారి ఇది జీవిత రహదారి

చరణం : 1

ఎవరు ఎవరికి తోడవుతారో

ఎప్పుడెందుకు విడిపోతారో

మమతను కాదని వెళతారో

మనసే చాలని ఉంటారో

ఎవ్వరి పయనం ఎందాకో...

అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ

అడగదు ఎవ్వరినీ బదులే దొరకదనీ

చరణం : 2

కడుపు తీపికి రుజువేముంది

అంతకు మించిన నిజమేముంది

కాయే చెట్టుకు బరువైతే చెట్టును భూమి మోస్తుందా

ఇప్పుడు తప్పును తెలుసుకునీ

జరిగేదే మిటనీ క్షమించదెవ్వరిని...

చరణం : 3

తెంచుకుంటివి అనుబంధాన్ని

పెంచుకున్నదొక హృదయం దాన్ని

అమ్మలిద్దరూ ఉంటారని అనుకోలేని పసివాణ్ణి

బలవంతాన తెచ్చుకునీ

తల్లివి కాగలవా తనయుడు కాగలడా

చరణం : 4

అడ్డదారిలో వచ్చావమ్మా

అనుకోకుండా కలిశావమ్మా

నెత్తురు పంచి ఇచ్చావు

నిప్పును నువ్వే మింగావు

ఆడదాని ఐశ్వర్యమేమిటో

ఇప్పుడు తెలిసింది కథ ముగిసేపోయింది

ఇప్పుడు తెలిసింది కథ ముగిసేపోయింది

ఓ బాటసారి ఇది జీవిత రహదారి


చిత్రం : ఇల్లాలు (1981)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : చక్రవర్తి

గానం : జేసుదాస్, శైలజ

No comments:

Post a Comment