Wednesday, March 16, 2011

Dagudu moothalu (1964) - 1

పాట - 1
పల్లవి :

డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం

డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం

డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం

డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం

బాజాలతో... బాకాలతో...పందిట్లో ఇద్దరం ఒకటౌదాం

బాజాలతో... బాకాలతో... పందిట్లో ఇద్దరం ఒకటౌదాం

డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం

చరణం : 1

అందరు చుట్టాలు వస్తారు ఆనందమానందమంటారు

అందరు చుట్టాలు వస్తారు ఆనందమానందమంటారు

అబ్బాయి తొందర చూస్తారు

తాము అటు తిరిగి పకాపకా నవ్వేరు

అబ్బాయి తొందర చూస్తారు

తాము అటు తిరిగి పకాపకా నవ్వేరు

డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం

డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం

చరణం : 2

కవ్వించి సిరులన్నీ కలిసొచ్చినా

కాబోవు పెళ్ళామే కడు పచ్చన

కొండకు వేశాను ఒక నిచ్చెన

నీ కొంగు తగిలితే ఒళ్ళు నులివెచ్చన

డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం

డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం

చరణం : 3

బుక్కా వసంతాలు జల్లుకుంటాం

ఎంచక్కా తలంబ్రాలు పోసుకుంటాం

బుక్కా వసంతాలు జల్లుకుంటాం

ఎంచక్కా తలంబ్రాలు పోసుకుంటాం

దీవించి వేస్తారు అక్షింతలు

ఇక అవుతాయి సౌఖ్యాలు లక్షంతలు

దీవించి వేస్తారు అక్షింతలు

ఇక అవుతాయి సౌఖ్యాలు లక్షంతలు

డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం

డీడిక్కంది అదృష్టం గట్టెక్కింది మనకష్టం

చిత్రం : దాగుడుమూతలు (1964)

రచన : ఆరుద్ర

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : పిఠాపురం, స్వర్ణలత

No comments:

Post a Comment