Friday, March 18, 2011

Gandhi puttina desam (1973) - 1

పాట - 1
పల్లవి :

గాంధీ పుట్టిన దేశం

రఘురాముడు ఏలిన రాజ్యం

ఇది సమతకు మమతకు సంకేతం

ఇది సమతకు మమతకు సంకేతం

గాంధీ పుట్టిన దేశం

రఘురాముడు ఏలిన రాజ్యం

ఇది సమతకు మమతకు సంకేతం

ఇది సమతకు మమతకు సంకేతం

రఘుపతి రాఘవ రాజారాం

పతితపావన సీతారం

ఈశ్వర అల్లా తేరే నాం

సబకో సన్మతి దే భగవాన్

చరణం : 1

భేదాలన్నీ మరచీ మోసం, ద్వేషం విడిచి

భేదాలన్నీ మరచీ మోసం, ద్వేషం విడిచి

మనిషి మనిషిగా బ్రతకాలి... ఏనాడూ నీతికి నిలవాలి

మనిషి మనిషిగా బ్రతకాలి... ఏనాడూ నీతికి నిలవాలి

బాపూ... ఈ కమ్మని వరమే మాకివ్వు

అవినీతిని గెలిచే బలమివ్వు... అవినీతిని గెలిచే బలమివ్వు

గాంధీ పుట్టిన దేశం

రఘురాముడు ఏలిన రాజ్యం

ఇది సమతకు మమతకు సంకేతం

ఇది సమతకు మమతకు సంకేతం

రఘుపతి రాఘవ రాజారాం

పతిత పావన సీతారం

ఈశ్వర అల్లా తేరే నాం

సబకో సన్మతి దే భగవాన్

చరణం : 2

ప్రజలకు శాంతి సౌఖ్యం... కలిగించే దేశ మె దేశం

ప్రజలకు శాంతి సౌఖ్యం... కలిగించే దేశ మె దేశం

బానిస భావం విడనాడి

ఏజాతి నిలుచునో అదిజాతి

బానిస భావం విడనాడి

ఏజాతి నిలుచునో అదిజాతి

బాపూ... నీ చల్లని దీవెన మా కివ్వు

నీ బాటను నడిచే బలమివ్వు... నీ బాటను నడిచే బలమివ్వు...

గాంధీ పుట్టిన దేశం

రఘురాముడు ఏలిన రాజ్యం

ఇది సమతకు మమతకు సంకేతం

ఇది సమతకు మమతకు సంకేతం

రఘుపతి రాఘవ రాజారాం

పతిత పావన సీతారం

ఈశ్వర అల్లా తేరే నాం

సబకో సన్మతి దే భగవాన్


చిత్రం : గాంధీ పుట్టిన దేశం (1973)

రచన : మైలవరపు గోపి

సంగీతం : ఎస్.పి.కోదండపాణి

గానం : పి.సుశీల, బృందం

No comments:

Post a Comment