Thursday, March 31, 2011

Jalsa (2008) - 3

పాట - 1
పల్లవి :

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే

తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే

ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే

ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే

ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు

ప్రేయసివో నువ్వు నా క ళ్ళకి

ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు

ఊయలవో నువ్వు నా మనసుకి

చరణం : 1

హే... నిదుర దాటి కలలే పొంగె

పెదవి దాటి పిలుపే పొంగె

అదుపుదాటి మనసే పొంగె... నాలో

గడపదాటి వలపే పొంగె

చెంపదాటి ఎరుపే పొంగె

నన్ను దాటి నేనే పొంగె... నీ కొంటె ఊసుల్లో

రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు

దిక్కులవో నువ్వు నా ఆశకి

తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు

తొందరవో నువ్వు నా ఈడుకి

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే

తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే

ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే

ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే

చరణం : 2

తలపుదాటి తనువే పొంగె

సిగ్గుదాటి చనువే పొంగె

గట్టుదాటి వయసే పొంగె లోలో

కనులుదాటి చూపే పొంగె

అడుగు దాటి పరుగే పొంగె

హద్దు దాటి హాయే పొంగె... నీ చిలిపి నవ్వుల్లో

తూరుపువో నువ్వు వేకువవో నువ్వు

సూర్యుడివో నువ్వు నా నింగికి

జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు

తారకవో నువ్వు నా రాత్రికి


చిత్రం : జల్సా (2008)

రచన : భాస్కరభట్ల

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : టిప్పు, గోపికా పూర్ణిమ

హమ్మింగ్స్ : దేవిశ్రీ ప్రసాద్

---

సాకీ :

They call him the cool cool angry man

super andhra thelusa

its the time for toll and the beat

come on come on karo jalsa...

jalsa... yo yo yo yo...

yo he's the man yo the jackie chan

he's the king of the andhra

his place is the super groovy hyderabad

and she is the baby girl sandra

పల్లవి :

సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా... స... జల్సా

సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా... స... జల్సా

తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా

సునామీ ఎదురుగ వస్తే ఎలాగ కనబడుతుందో

తెల్సా తెల్సా తెల్సా ఎవ్వరికైనా తెల్సా

తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో

అరె తెలియకపోతే చూడర బాబూ హిజ్ హ్యూమన్ సునామీ

తెలియాలనుకుంటే డేంజర్ బాబూ యు హావ్ గాటో బిలీవ్ మి

హే... సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా... స... జల్సా

హే... సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా... స...

వన్ మోర్ టైమ్... జల్సా...

చరణం : 1

హైటెంతుంటాడో కొలవాలనిపిస్తే అమాంతమూ

అలా అలా మౌంటెవరెస్ట్ అవుతాడు

ఫైటేంచేస్తాడో అని సరదాపడితే స్ట్రెచర్ తనై

సరాసరి వార్డుకి చేరుస్తాడు

అరె గడ్డిపోచ అనుకుని తుంచడానికొస్తే

గడ్డపార నమిలేస్తాడు

గుండు సూది చేతికిచ్చి దండ గుచ్చమంటే

కొండ తవ్వి పారేస్తాడూ...

హే... సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా... స... జల్సా

హే... సనిదపమగరిస అరె కరో కరో జర జల్సా...

చరణం : 2

మనవాడనుకుంటే చెలికాడవుతాడు

హెయ్ విమానమై భుజాలపై సవారి చేయిస్తాడు

పగవాడనుకుంటే విలుకాడవుతాడు

హెయ్ ప్రమాదమై క్షణాలలో శవాలు పుట్టిస్తాడు

హే... దోసెడు పూలను తెచ్చిపెట్టమంటే

తోటలన్నీ నొల్లుకొస్తాడు

యమపాశం వచ్చి పీకచుట్టుకుంటే

దానితోటి ఊయలూగుతాడు

సరిగమపదనిస అరె కరో కరో జర జల్సా... స... జల్సా

సనిదపమగరిస అరె కరో కరో కరో జర జల్సా... స... జల్సా


చిత్రం : జల్సా (2008)

రచన : సిరివెన్నెల

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : బాబా సెహగల్, రీటా

----

పల్లవి :

మై హార్ట్ ఇజ్ బీటింగ్... అదోలా తెలుసుకోవా... అదీ

ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా తరుముతోందీ... మదీ

పెదవిపై పలకవే మనసులో ఉన్న సంగతీ

కనులలో వెతికితే దొరుకుతుందీ

టీ స్పూన్ టన్ను బరువౌతుంటే

ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే

క్లౌడ్ నైన్ కాళ్ళకిందకొచ్చిందే

ల్యాండ్‌మైన్ గుండెలో పేలిందే...

మై హార్ట్ ఇజ్ బీటింగ్... అదోలా తెలుసుకోవా... అదీ

ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా తరుముతోందీ... మదీ

చరణం : 1

పెనుతుఫాను ఏదైనా మెరుపుదాడి చేసిందా

మునుపులేని మైకానా మదిని ముంచి పోయిందా

ఊరికినే పెరగదుగా ఊపిరి సలపని భారమిలా

నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా

తలపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాలా

తలడగతో తలబడుతూ తెల్లార్లూ ఒంటరిగా వేగాలా

సెల్‌ఫోన్ నీ కబురు తెస్తుంటే స్టెన్‌గన్ మోగినట్టు ఉంటుందే

క్రామ్టాన్ ఫ్యాన్ గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే...

మై హార్ట్ ఇజ్ బీటింగ్... అదోలా తెలుసుకోవా... అదీ

ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా తరుముతోందీ... మదీ

చరణం : 2

ఎపుడెలా తెగిస్తానో నా మీదే నాకు అనుమానం

మాటల్లో పైకనేస్తానో నీ మీద ఉన్న అభిమానం

త్వరత్వరగా తరిమినదే పద పద పద మని పడుచు రథం

ఎదలయలో ముదిరినదే మధనుడి చిలిపి రథం

గుసగుసగా పిలిచినదే మనసున విరిసిన కలలవనం

తహతహగా తడిమినదే దమ్మరథం అంటూ తూలే ఆనందం

ఫ్రీడమ్ దొరికినట్టు గాలుల్లో వెల్‌కమ్ పిలుపు వినిపిస్తుందే

బాణం వేసినట్టు ఎదుల్లో ప్రాణం దూసుకెళ్ళి పోతుందే...

మై హార్ట్ ఇజ్ బీటింగ్... అదోలా తెలుసుకోవా... అదీ

ఎన్నాళ్ళీ వేయిటింగ్ అనేలా తరుముతోందీ... మదీ


చిత్రం : జల్సా (2008)

రచన : సిరివెన్నెల

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : కె.కె.

No comments:

Post a Comment