Tuesday, March 29, 2011

Happy (2006) - 1

పాట - 1
పల్లవి :
ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

ఈ ఉదయం ఏ హృదయం

హే...చేరుతుందో ఈ ప్రేమ

ఏ నిమిషం ఏది నిజం

హో... తెలియకుందే ఆ మాయ

ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే

తగువులోనే చిగురు వేసిందే హే...

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

చరణం : 1

నిదరోయే నీకనులు ఎదలోన ఆ కలలు

ఎదురైన ఎపుడైన కళ్ళారా చూసేనా

నీతో కలిసి నీతో పెరిగి నీతొ తిరిగి ఆశగా

నిన్నే తలచి నిన్నే పిలిచి ఈన్నాళ్ళుగా

నువ్వంటే ఇష్టం ఉన్నా నువ్వే నా సర్వం అన్నా

నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ

చరణం : 2

ఎటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు

ఇపుడైన ఇకనైన నీ పంతం ఆగేనా

అన్ని మరిచి కోపం విడిచి

నాతో చెలిమి చేసినా

పోయే వరకు నా ఈ బతుకు నీదే కాదా

నీతోడే కావాలంటు నీ నీడై ఉండాలంటు

నవరాగాలు ఆలాపించే నాలో ఈ ప్రేమ

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

ఈ ఉదయం ఏ హృదయం

హే...చేరుతుందో ఈ ప్రేమ

ఏ నిమిషం ఏది నిజం

హో... తెలియకుందే ఆ మాయ

ఆశపడితే అందనందే ఉరుకుంటే చేరుకుందే

తగువులోనే చిగురు వేసిందే హే...

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెల వాన

పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో

చిత్రం : హ్యాపి (2006)

రచన : కులశేఖర్

సంగీతం : యువన్‌శంకర్‌రాజా

గానం : ఎస్.పి.చరణ్, బృందం

No comments:

Post a Comment