Tuesday, March 29, 2011

Idiot (2002) - 3

పాట - 1

పల్లవి :

చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్

ఓలల్లా... గుండెల్ని గుల్ల చేసి జారకే మెరే హాయ్

నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే

నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే

నీ కళ్లు పేలిపోను చూడవే మెరే హాయ్

చరణం : 1

నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే

నీ ప్రేమ నాలో నింపే మైకమే హాయ్ మైకమే

ఏదోలా కొత్తగా ఉంది లోకమే హాయ్ లోకమే

నిలువెల్లా నీరైపోయె దేహమే హాయ్ దేహమే

లైఫంతా అయిపోయింది భారమే హాయ్

నీ అందం అడవైపోను చూడవే మెరే హాయ్

ఓలల్లా... చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్

చరణం : 2

నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే

నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే

నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే

సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే

చీ అంటే జిందగి మొత్తం నరకమే హాయ్

నీ ఈడు బీడైపోను చూడవే మెరే హాయ్

ఓలల్లా... చూపుల్తొ గుచ్చి గుచ్చి చంపకే మెరే హాయ్

గుండెల్ని గుల్ల చేసి జారకే మెరే హాయ్

ఓలల్లా... నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే

నీ ప్రేమ కోసం నేను పిచ్ఛోణ్ణైపోయానే

నీ కళ్లు పేలిపోను చూడవే మెరే హాయ్


చిత్రం : ఇడియట్ (2002)

రచన : కందికొండ

సంగీతం : చక్రి

గానం : శంకర్‌మహదేవన్

----

పాట - 2

పల్లవి :

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా

నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐలవ్‌యురా

నిన్నే తలచీ నన్నే మరిచా ఓ కన్నా ఐలవ్‌యురా

కనురాల్చే కన్నీరువో నను చేరే పన్నీరువో

నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా

చరణం : 1

కన్నులలోనా వెన్నెలలోనా నీరూపుతోచి

ఊహలలోనా ఊసులలోనా నీ ఆశలే నాలో నీ బాసలే

తొలిసారిగ సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా

అపుడపుడూ తడిమేస్తోంది తడిపేస్తోంది మధువల వానా

ఆనందమై నాలో అనుబంధమై

నీ ప్రేమ నను చేరి మురిపించెరా

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా

చరణం : 2

ఉదయించే అరుణం నేనై నిను చేరుకోనా

వికసించే కుసుమంనేనై నినుతాకనా నీలో సడిచేయనా

పనిచేస్తే పక్కన చేరి సందడి చేస్తు గుసగుసలే

పడుతుంటే అల్లరి చేస్తూ నను లాగేస్తూ తుంటరి కలలే

సంగీతమై నాలో సంతోషమై

నీ ప్రేమ కలలెన్నో పండించేరా

ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా

చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా

నా ఊపిరితో జీవించేటి ఓ చంటి ఐలవ్‌యురా

నిన్నే తలచీ నన్నే మరిచా ఓ కన్నా ఐలవ్‌యురా

కనురాల్చే కన్నీరువో నను చేరే పన్నీరువో

నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా

చంటి... ప్లీజ్... హహ్హాహ్హా...


చిత్రం : ఇడియట్ (2002)

రచన : కందికొండ

సంగీతం : చక్రి

గానం : కౌసల్య

----

పాట - 3

పల్లవి :

లేలేత నవ్వులా పింగాని బొమ్మలా

అందాలు అందితే అల్లుకోనా

బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా

కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా

ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామా

కోలో కోలో రామా నువ్వేలే కోనసీమా

రంగేళి రూపమా బంగాళఖాతమా

ఊరించి చేయకే హైరానా

లేలేత నవ్వులా పింగాని బొమ్మలా

అందాలు అందితే అల్లుకోనా

బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా

కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా

చరణం : 1

ఎట్టా దాచావోగాని ఇన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయ్ దోరగా

ఒళ్ళే వేడిక్కి ఉంది చాన్నాళ్ళుగా అది చేసింది ఎంతచొరవా

ఒడి చేరమంటు పిలిచింది ఆడతనమా హో...

నిను చూసినాక నీ మనసు ఆపతరమా

నీ కాలి మువ్వనైపోనా

నువు ఊగేటి ఊయలైరానా

నీ పూల పక్కనైపోనా

తమలపాకుల్లో పక్కనైరానా

గోదారి తీరమా మంజీరనాదమా

కవ్వింతలెందుకే హాయ్ రామా

లేలేత నవ్వులా పింగాని బొమ్మలా

అందాలు అందితే అల్లుకోనా

బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా

కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా

చరణం : 2

లిల్లీ పూవంటి సోకు నాదేనుగా మరి గిల్లి గిచ్చెయ్ తేరగా

అగ్గే రేగింది నాలో చూశావుగా అది చేసింది ఎంతగొడవా

చిరు చీకటింట చేరాలి కొంటెతనమా

దరి చేరినాక పులకించు పూలవనమా

నీ గోటి గాటునైపోనా

మరి నీగుండె గూటికే రానా

ఆ గోరువంకనైపోనా

చెలి ఈ వాగువంకనైరానా

నాలోని భాగమా ఆ నీలిమేఘమా

ఇచ్చాక ఎందుకో హైరనా

లేలేత నవ్వులా పింగాని బొమ్మలా

అందాలు అందితే అల్లుకోనా

బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా

కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా

ఏలో ఏలో ప్రేమా సరసాల సత్యభామా

కోలో కోలో రామా నువ్వేలే కోనసీమా

రంగేళి రూపమా బంగాళఖాతమా

ఊరించి చేయకే హైరానా

లేలేత నవ్వులా పింగాని బొమ్మలా

అందాలు అందితే అల్లుకోనా

బాగుంది వెన్నెలా కూ అంది కోయిలా

కౌగిళ్ళలో నిన్ను హత్తుకోనా


చిత్రం : ఇడియట్ (2002)

రచన : భాస్కరభట్ల

సంగీతం : చక్రి

గానం : ఉదిత్‌నారాయణ్, కౌసల్య



No comments:

Post a Comment