Thursday, April 7, 2011

Letha manasulu (1966) - 2

పాట - 1
పల్లవి :

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ

నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

అందాల చెలికాడా అందుకో నా లేఖ

నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను

చరణం : 1

మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని

మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని

కురుల మోముపై వాలెనేలనో

విరులు కురులలో నవ్వెనెందుకో

అడుగుతడబడే చిలకకేలనో

పెదవి వణికెను చెలియకెందుకో

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ

నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

చరణం : 2

మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి

మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి

కురుల మోముపై మరులు గొనెనులే

విరులు కురులలో సిరులు నింపెలే

అడుగుతడబడి సిగ్గు బరువుతో

పెదవి వణికెలే వలపు పిలుపుతో

అందాల చెలికాడా అందుకో నా లేఖ

నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ

నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

చరణం : 3

నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి

ప్రణయ పాఠము వయసు నేర్పులే

మధుర మార్గము మనసు చూపులే

నీవు పాడగా నేను ఆడగా

యుగము క్షణముగా గడచిపోవుగా

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ

నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా


చిత్రం : లేతమనసులు (1966)

రచన : దాశరథి

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

గానం : పి.బి.శ్రీనివాస్. పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

పిల్లలు దేవుడు చల్లని వారే

కల్లకపటమెరుగని కరుణామయులే

పిల్లలు దేవుడు చల్లని వారే

కల్లకపటమెరుగని కరుణామయులే

తప్పులు మన్నించుటే దేవుని సుగుణం

ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం

తప్పులు మన్నించుటే దేవుని సుగుణం

ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం

పిల్లలు దేవుడు చల్లని వారే

కల్లకపటమెరుగని కరుణామయులే

చరణం : 1

పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును

పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును

ఆ పురుటికందు మనసులో దైవముండును

ఆ పురుటికందు మనసులో దైవముండును

వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే

వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే

అంత మనిషిలో దేవుడే మాయమగునులే

అంత మనిషిలో దేవుడే మాయమగునులే

పిల్లలు దేవుడు చల్లని వారే

కల్లకపటమెరుగని కరుణామయులే

చరణం : 2

వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును

వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును

మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును

మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును

గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే

గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే

మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే

మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే

పిల్లలు దేవుడు చల్లని వారే

కల్లకపటమెరుగని కరుణామయులే

చరణం : 3

పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు

పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు

ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు

ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు

మాయమర్మమేమి లేని బాలలందరు

మాయమర్మమేమి లేని బాలలందరు

ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే

ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే

పిల్లలు దేవుడు చల్లని వారే

కల్లకపటమెరుగని కరుణామయులే


చిత్రం : లేతమనసులు (1966)

రచన : ఆరుద్ర

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

గానం : పి.సుశీల

Leader (2010) - 1

పాట - 1
పల్లవి :

ఔననా కాదనా నాదనా... ఓ...

లేదనా రాదనా వేదనా... ఓ...

మూగ మైనా... రాగమేనా...

నీటిపైన... రాతలేనా... ఓ... ఆ...

ఔననా కాదనా నాదనా... ఓ...

లేదనా రాదనా వేదనా... ఓ...

చరణం : 1

తార తార దూరమైన చోటనే ఆకాశాలు

కన్ను నీరు వెలు్లవైతే వెన్నెలే కాబోలు

నింగి నేల ఏకమైన పొద్దులో సిందూరాలు

నీకు నేను చేరువైనా ఎందుకో దూరాలు

దొరికింది దొరికింది తోడల్లే దొరికింది

కలిసింది కలిసింది కనుచూపే కలిసింది

దొరికింది దొరికింది తోడల్లే దొరికింది

కలిసింది కలిసింది కనుచూపే కలిసింది

ఇందుకేనా ప్రియా... ఇందుకేనా ఓ...

ఔననా కాదనా నాదనా... ఓ...

లేదనా రాదనా వేదనా... ఓ...

ఆ... ఆ... ఆ... ఆ... ఆ.....

నాననా... నాననా... ఆ...

చరణం : 2

ఆశలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే

శ్వాసలేలే బాసలన్నీ బాధలై పోయేనా

పూలజడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే

రాసలీల రక్తధార బాధలై పోయేనా

తెలిసింది తెలిసింది నిజమేదో తె లిసింది

కురిసింది విరిసింది మెరుపేదో మెరిసింది

తెలిసింది తెలిసింది నిజమేదో తె లిసింది

కురిసింది విరిసింది మెరుపేదో మెరిసింది

ఇందుకేనా ప్రియా... ఇందుకేనా ఓ...

ఔననా కాదనా నాదనా... ఓ...

లేదనా రాదనా వేదనా... ఓ...


చిత్రం : లీడర్ (2010)

రచన : డా.వేటూరి సుందరరామమూర్తి

సంగీతం : మిక్కీ జె.మేయర్

గానం : నరేష్ అయ్యర్, శ్వేతా పండిత్

Lankeswarudu (1989) - 1

పాట - 1
పల్లవి :

జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది

వెచ్చని కోరిక రగిలిందిలే

నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమగీతం

కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది

తీయని కానుక దొరికిందిలే

నీవే నా ప్రేమవులే నీకేలే అందుకో ప్రేమగీతం

జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది

చరణం : 1

ఒంపుల్లో సొంపుల్లో అందముంది

కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది

ఒంపుల్లో సొంపుల్లో అందముంది

కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది

కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో

కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగులనే నేర్పావే

నేనే నిను కోరి చేరి వాలిపోవాలి

కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది

చరణం : 2

మంచల్లే కరగాలి మురిపాలు

సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు

మంచల్లే కరగాలి మురిపాలు

సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు

కొమ్మల్లో పూలన్నీ పానుపుగా మన ముందుంచె పూలగాలి

పూవుల్లో దాగున్న అందాలనే మన ముందుంచె గంధాలుగా

నేనే నిను కోరి చేరి వాలిపోవాలి

జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది

కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది


చిత్రం : లంకేశ్వరుడు (1989)

రచన : దాసరి నారాయణరావు

సంగీతం : రాజ్-కోటి

గానం : మనో, ఎస్.జానకి

Wednesday, April 6, 2011

Kushi (2001) - 1

పాట - 1
పల్లవి :

చెలియా చెలియా చిరుకోపమా

చాలయ్యా చాలయ్యా పరిహాసము...

కోపాలు తాపలు మనకేలా

సరదాగా కాలాన్ని గడపాలా

సలహాలు కలహాలు మనకేలా

ప్రేమంటే పదిలంగ ఉండాలా

చెలియా చెలియా చిరుకోపమా

చాలయ్యా చాలయ్యా పరిహాసము...

చరణం : 1

రెమ్మల్లో మొగ్గ నే పూయను పోమ్మంటె

గాలి తాకంగా పూచెనులే

ఐతే గాలె గెలిచిందనన లేక పువ్వే ఓడిందనన

రాళ్ళల్లో శిల్పం లోలోపల దాగున్న

ఉలి తాకంగా వెలిసెనులే

ఐతే ఉలియే గెలిచిందననలేక శిల్పం ఓడిందనన

ఈ వివరం తెలిపేది ఎవరంటా

వ్యవహారం తీర్చేది ఎవరంటా

కళ్ళల్లో కదిలేటి కలలంటా

ఊహల్లో ఊగేది ఊసంటా

చెలియా చెలియా చిరుకోపమా

చరణం : 2

నీలిమేఘాలు చిరు గాలిని ఢీకొట్టి

మబ్బు వానల్లె మారునులే

దీన్ని గొడవే ననుకోమన న లేక నైజం అనుకోన

మౌనరాగాలు రెండు కళ్ళను ఢీకొంటే

ప్రేమ వాగల్లె పొంగునులే

దీన్ని ప్రళయం అనుకోమనన లేక ప్రణయం అనుకోన

ఈ వివరం తెలిపేది ఎవరంటా

వ్యవహారం తీర్చేది ఎవరంటా

అధరాలు చెప్పేటి కథలంటా

హృదయంలో మెదిలేటి వలపంటా

చెలియా చెలియా చిరుకోపమా

చాలయ్యా చాలయ్యా పరిహాసము...


చిత్రం : ఖుషి (2001)

రచన : ఎ.ఎం.రత్నం

సంగీతం : మణిశర్మ

గానం : శ్రీనివాస్, హరిణి

Kurradu (2009) - 1

పల్లవి :

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే

ఏమౌతావే ఆ మాటేప్రేమైతే

ఔనంటావే నాలానే నీకూ ఉంటే

తడౌతావే నీలోనే నేనుంటే

నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది

ఈ నవ్వూ చూపు కలిసే వేళ ఇదే

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే

ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే

ఔనంటావే నాలానే నీకూ ఉంటే

తడౌతావే నీలోనే నేనుంటే

చరణం : 1

సంతోషం ఉన్నా సందేహంలోనా లోనా

ఉంటావే ఎన్నాళ్ళైనా ఎవ్వరివమ్మా

అంతా మాయేనా సొంతం కాలేనా లేనా

అంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మ

యవ్వనమా జమున వనమా

ఓ జాలే లేదా జంటై రావే ప్రేమా

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే

ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే

ఔనంటావే నాలానే నీకూ ఉంటే

తడౌతావే నీలోనే నేనుంటే

చరణం : 2

అందాలనుకున్నా నీకే ప్రతిచోట చోట

బంధించే కౌగిలిలోనే కాదనకమ్మా

చెందాలనుకున్నా నీకే ప్రతిపూట పూట

వందేళ్ళు నాతో ఉంటే వాడదు ఆశలకొమ్మ

అమృతమాఅమిత హితమా

హో అంతా నీ చేతుల్లో ఉందే ప్రేమా

ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే

ఏమౌతావే ఆ మాటే ప్రేమైతే

ఔనంటావే నాలానే నీకూ ఉంటే

తడౌతావే నీలోనే నేనుంటే

నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది

ఈ నవ్వూ చూపు కలిసే వేళ ఇదే


చిత్రం : కుర్రాడు (2009)

రచన : అనంత శ్రీరామ్

సంగీతం : అచ్చు

గానం : కార్తీక్

Kunthi putrudu (1993) - 1

పాట - 1
జాలాది
పల్లవి :

ఆ ఆ ఆ... ఓ... ఆ... ఓ... ఆ...

లేలే బాబా నిద్దుర లేవయ్యా

ఏలే స్వామి మేలుకోవయ్యా

రవితేజ కిరణమే నీ శర ణు కోరుతూ

చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా

లేలే... లేలే... లేలేబాబా నిద్దుర లేవయ్యా

ఏలే స్వామి మేలుకోవయ్యా

చరణం : 1

వేగుచుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలుపెట్టి... ఆ...

వేగుచుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలుపెట్టి

పాదసేవ చేసుకొనే వేళదాటి పోయెనని

ప్రశ్న వేయకుంటే మంచిదే ఇద్దరికీ

పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికీ

అందుకనే గుండె నీ గురుపీఠమైనది

ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది

అంతకుమించిన భాగ్యమేదిరా బాబా

లేలే బాబా నిద్దుర లేవయ్యా

ఏలే స్వామి మేలుకోవయ్యా

రవితేజ కిరణమే నీ శర ణు కోరుతూ

చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా

లేలే బాబా నిద్దుర లేవయ్యా

ఏలే స్వామి మేలుకోవయ్యా

చరణం : 2

నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై

సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై

లోకములు కాచే తండ్రివి నీవేననీ

రూపుముల ఏకములైన శ్రీసాయిని

నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై

కుమ్మరించు వరములే సుఖశాంతి నెలవులై

వెన్నంటే నువ్వుంటేలోటే లేదుగా

లేలే బాబా నిద్దుర లేవయ్యా

ఏలే స్వామి మేలుకోవయ్యా

రవితేజ కిరణమే నీ శర ణు కోరుతూ

చరణాలను చేరగ తలుపు తీసెరా బాబా

లేలే బాబా నిద్దుర లేవయ్యా

ఏలే స్వామి మేలుకోవయ్యా


చిత్రం : కుంతీపుత్రుడు (1993)

రచన : జాలాది

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

Kulagothralu (1962) - 1

పల్లవి :

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

అనుపల్లవి :

ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది

ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది

పెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయింది

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

చరణం : 1

ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయీ

ఓటమి తప్పలేదు భాయీ

మరి నువు చెప్పలేదు భాయీ

అది నా తప్పుగాదు భాయీ

తెలివి తక్కువగ చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ

బాబూ నిబ్బరించవోయీ

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

చరణం : 2

నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది

ఎంతో పుణ్యం దక్కేది

గోవిందా... గోవిందా...

నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది

ఎంతో పుణ్యం దక్కేది

చక్కెర పొంగలి చిక్కేది

ఎలక్షన్లలో ఖర్చుపెడితే ఎం.ఎల్.ఎ దక్కేది

మనకు అంతటి లక్కేది

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే

చరణం : 3

గెలుపూ ఓటమి దైవాధీనంచెయ్యి తిరగవచ్చు

మళ్ళీ ఆడి గెల్వవచ్చు

ఇంకా పెట్టుబడెవడిచ్చు

ఇల్లు కుదవ చేర్చవచ్చు

ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు

పోతే... అనుభవమ్ము వచ్చు

చివరకు జోలె కట్టవచ్చు

అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే

అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే


చిత్రం : కులగోత్రాలు (1962)

రచన : కొసరాజు రాఘవయ్య చౌదరి

సంగీతం: సాలూరి రాజేశ్వరరావు

గానం : మాధవపెద్ది, పిఠాపురం, రాఘవులు

Kuladaivam (1960) - 1

పాట - 1
పల్లవి :

పయనించే ఓ చిలుకా... ఆ...

పయనించే ఓ చిలుకాఎగిరిపో పాడైపోయెను గూడు

పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు

పయనించే ఓ చిలుకా... ఆ...

చరణం : 1

తీరెను రోజులు నీకీ కొమ్మకు పోమ్మా ఈ చోటు వదలి

తీరెను రోజులు నీకీ కొమ్మకు పోమ్మా ఈ చోటు వదలి

ఎవరికి వారే ఏదోనాటికి ఎరుగము ఎటకో బదిలి

మూడు దినాల ముచ్చటయే...

మూడు దినాల ముచ్చటయే...

ఈ లోకంలో మన మజిలి

నిజాయితీగా ధర్మపథాన...

నిజాయితీగా ధర్మపథాన...

చనుమా ధైర్యమె తోడు..

పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు

పయనించే ఓ చిలుకా... ఆ...

చరణం : 2

పుల్లా పుడక ముక్కున కరచి... గూడును కట్టితివోయి

పుల్లా పుడక ముక్కున కరచి... గూడును కట్టితివోయి

వానకు తడిసిన నీ బిగిరెక్కలు ఎండకు ఆరినవోయి

ఫలించలేదని చేసిన కష్టము...

ఫలించలేదని చేసిన కష్టము...

మదిలో వేదన వలదోయి

రాదోయి సిరి నీ వెనువెంట...

రాదోయి సిరి నీ వెనువెంట...

త్యాగమే నీ చేదోడు

పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు

పయనించే ఓ చిలుకా... ఆ...

చరణం : 3

మరవాలి నీ కులుకుల నడలే... మదిలో నయగారాలే

మరవాలి నీ కులుకుల నడలే... మదిలో నయగారాలే

తీరని వేదన తీయని ముసుగే శిరసున సింగారాలే

ఓర్వలేని ఈ జగతికి నీపై...

ఓర్వలేని ఈ జగతికి నీపై...

లేవే కనికారాలే...

కరిగీ కరిగీ కన్నీరై... కరిగీ కరిగీ కన్నీరై...

కడతేరుటె నీతలవ్రాలే

పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు

పయనించే ఓ చిలుకా... ఆ...

చరణం : 4

గోడుమని విలపించేరే... నీ గుణము తెలిసినవారు

గోడుమని విలపించేరే... నీ గుణము తెలిసినవారు

జోడుగ నీతో ఆడిపాడి కూరములాడినవారు

ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే

ఎన్నడో తిరిగి ఇటు నీ రాక ఎవడే తెలిసినవాడు

పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు

పయనించే ఓ చిలుకా... ఆ...


చిత్రం : కులదైవం (1960)

రచన :సముద్రాల జూనియర్

సంగీతం : మాస్టర్ వేణు

గానం : ఘంటసాల

Kshana kshanam (1991) - 2

పాట - 1
పల్లవి :

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కలా

వయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన

స్వరాల ఊయలూగువేళ

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

చరణం : 1

కుహు కుహు సరాగాలే శృతులుగా

కుశలమా అనే స్నేహం పిలువగా

కిలకిల సమీపించే సడులతో

ప్రతి పొద పదాలేవొ పలుకగా

కులుకురాక బుట్టబొమ్మ గుబులుగుందని

వనములేచి వద్ద కొచ్చి నిద్రపుచ్చని

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

చరణం : 2

మనసులో భయాలన్ని మరిచిపో

మగతలో మరో లోకం తెరుచుకో

కలలతో ఉషాతీరం వెతుకుతూ

నిదరతో నిషారాన్నే నడిచిపో

చిటికలోన చిక్కబట్టి కటిక చీకటి

కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి

జామురాతిరి జాబిలమ్మ జోలపాడనా ఇలా

జోరుగాలిలో జాజికొమ్మ జారనీయకే కలా

వయ్యారి వాలు కళ్ళలోన వరాల వెండి పూలవాన

స్వరాల ఊయలూగు వేళ...


చిత్రం : క్షణ క్షణం (1991)

రచన : సిరివెన్నెల

సంగీతం : ఎం.ఎం. కీరవాణి

గానం : ఎస్.పి.బాలు, చిత్ర

----

పాట - 2

పల్లవి :

కింగులా కన్పిస్తున్నాడు మరి వంగి వంగి దణ్ణాలెందుకు పెడుతున్నాడు

ఏమా సరదా గమ్మత్తుగా లేదా ఏమా సరదా

రాజైనా రారాజైనా మనీ ఉన్న మన ముందు సలామ్ కొట్టవలసిందే

ఈ టిప్పు దెబ్బ తగిలిందంటే బోర్లా పడవలసిందే

పైసా ఉంటే పరిగెత్తుకురాడా పరమాత్మైనా

కో అంటే... కోటి! దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి

తందర్‌తర్‌దా తందర్‌తర్‌దాదా తందర్‌తర్‌దా

తందర్‌తర్‌దాదా తందర్‌తర్‌దా

చరణం : 1

ఓయబ్బో మయసభలా యమాగా ఉంది ఏమి మాయలోకమిది

అచ్చ తెలుగులో ఐదు తారల పూటకూళ్ళ ఇల్లు

మేకప్ వేసి మరో భాషలో ఫైవ్‌స్టార్ హోటల్ అంటారు

ఎస్ యూ హేవ్ ఎనీ రిజర్వేషన్

అయ్యయ్యో లేదే...

వెల్‌కమ్ సార్... వెల్‌కమ్ లేడీ...

వుయ్ ఆర్ గ్లాడ్ టూ హేవ్ యూ హియర్

టూ సర్వ్ యూ ఈజ్ అవర్ ప్లెజర్

రెపరెపలాడే రంగు కాగితం ఏవిఁటదీ

దేవుళ్లైనా దేవుల్లాడే అంత మహాత్మ్యం ఏముందీ

శ్రీ లక్ష్మీదేవి స్వహస్తంతో సంతకం చేసిన పత్రం

ఎవరక్కడ అంటే చిత్తం అంటుంది లోకం మొత్తం

చెక్ అంటారు దీన్ని... చెక్ ఇన్ సార్

కో అంటే... కోటి! దొర్లుకుంటూ వస్తుంది కొండమీది కోతి

చరణం : 2

వావ్... అయ్యయ్యో... అహ్హహ్హా... ఐ కాంట్ బిలీవ్ ఇట్

అయ్ బాబోయ్‌గదా ఇది స్వర్గమేమో కదా ఇది

పైసాల్లో పవ ర్ ఇది పన్నీటి షెవర్ ఇది

కాసు ముందు గాలైనా కండిషెన్‌లో ఉంటుంది

పైకంతో ప్రపంచమంతా పడకగదికి వస్తుంది

మబ్బులతో పరుపును కుట్టి

పాలనురుగు దుప్పటి చుట్టి

పరిచి ఉంచిన పానుపు చూస్తే

మేలుకోవా కలలన్నీ...

తందర్‌తర్‌దా తందర్‌తర్‌దాదా తందర్‌తర్‌దా

తందర్‌తర్‌దాదా తందర్‌తర్‌దాతందర్‌తర్‌దాదా తందర్‌తర్‌దా


చిత్రం : క్షణ క్షణం (1991)

రచన : సిరివెన్నెల

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : బాలు, శ్రీదేవి, రిక్కి

Krishnaveni (1974) - 1

పాట - 1
పల్లవి :

సంగీతం మధుర సంగీతం

సంగీతం మధుర సంగీతం

తల్లి పిల్లల హృదయ సంకేతం

సంగీతం మధుర సంగీతం

చరణం : 1

ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం

ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం

మదిలో మమతలే మంజుల రవళిగ మ్రోగెను మోహనరాగం

సంగీతం మధుర సంగీతం

చరణం : 2

బాలపాపల ఆటల పాటలె అమ్మకు కమ్మని గీతం

ఆకాశవీధుల సాగే గువ్వలు తె చ్చే ప్రేమ సందేశం

సంగీతం మధుర సంగీతం

చరణం : 3

ఎన్నో నోముల పంటలు పండి ముచ్చట గొలుపు సంతానం

ఎన్నో నోముల పంటలు పండి ముచ్చట గొలుపు సంతానం

ఆశాఫలముల రాశులు ఎదలో చేసెను రాగ సంచారం

సంగీతం మధుర సంగీతం

చరణం : 4

శోభన జీవన దీపావళిలో పెరిగెనుపావనతేజం

తనివే తీరా తనయుల చేర తల్లికి తరగని భాగ్యం

సంగీతం మధుర సంగీతం

తల్లి పిల్లల హృదయ సంకేతం

సంగీతం మధుర సంగీతం


చిత్రం : కృష్ణవేణి (1974)

రచన : ఆరుద్ర

సంగీతం : విజయభాస్కర్

గానం : పి.సుశీల

Kottabangarulokam (2008) - 3

పాట - 1
పల్లవి :

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఎన్నొ వింతలు చూస్తున్నా

ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా

వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామా...

మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా... ఏమ్మా

హరే హరే హరే హరే హరే రామా...

మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా... ఏమ్మా

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఎన్నొ వింతలు చూస్తున్నా

చరణం : 1

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం

నా మనస్సుకి ప్రతిక్షణం నువ్వే ప్రపంచం

ఓ సముద్ర మై అనుక్షణం పొంగే సంతోషం

అడుగులలోనా అడుగుల వేస్తూ

నడచిన దూరం ఎంతో ఉన్నా

అలసట రాదూ గడచిన కాలం ఇంతని నమ్మనుగా...

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఎన్నొ వింతలు చూస్తున్నా

చరణం : 2

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే

నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే

ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే

పెదవికి చెంపా తగిలిన చోట

పరవశమేదో తోడౌతుంటే

పగలే అయినా గగనంలోనా తారలు చేరెనుగా...

నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా

ఇదంతా ప్రేమేనా ఎన్నొ వింతలు చూస్తున్నా

ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా

వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామా...

మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా... ఏమ్మా

హరే హరే హరే హరే హరే రామా...

మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా

ఎంతో హుషారుగా ఉన్నాదేదో లోనా... ఏమ్మా


చిత్రం : కొత్త బంగారులోకం (2008)

రచన : అనంత శ్రీరామ్

సంగీతం : మిక్కీ జె.మేయర్

గానం : కార్తీక్

----

పాట - 2

పల్లవి :

నేననీ నీవనీ వేరుగా లేమనీ

చెప్పినా వినరా ఒకరైనా

నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ

ఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే

అడ్డుకోగలదా వేగం కొత్త బంగారూ లోకం పిలిస్తే

చరణం : 1

మొదటిసారి మదిని చేరి నిదరలేపిన ఉదయమా

వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా

మరీ కొత్తగా... మరో పుట్టుకా

అనేటట్టుగా... ఇది నీ మాయేనా

నేననీ నీవనీ వేరుగా లేమనీ

చెప్పినా వినరా ఒకరైనా

నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ

ఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే

అడ్డుకోగలదా వేగం కొత్త బంగారూ లోకం పిలిస్తే

చరణం : 2

పదము నాది పరుగు నీది రథమువై రా ప్రియతమా

తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా

నువ్వే దారిగా... నేనే చేరగా

ఎటూ చూడకా... వెనువెంటే రానా

నేననీ నీవనీ వేరుగా లేమనీ

చెప్పినా వినరా ఒకరైనా

నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ

ఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాలా స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే

అడ్డుకోగలదా వేగం కొత్త బంగారూ లోకం పిలిస్తే

చిత్రం : కొత్తబంగారులోకం (2008)

రచన : సిరివెన్నెల

సంగీతం : మిక్కీ జె.మేయర్

గానం : శ్వేత పండిట్

----

పాట - 3

పల్లవి :

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా

నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా

ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా

ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా

పది నెలలు తనలో నిన్ను మోసిన అమై్మనా

అపుడో ఇపుడో కననీ కలను అంటుందా

ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమై్మనా

గుడికో జడకో సాగనంపక ఉంటుందా

బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా

పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగ

ఒక నిమిషం కూడ ఆగిపోదే నువ్వొచ్చేదాకా

ఓ... ఓ... ఓ... ఓ.....

చరణం : 1

అలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా

కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా

గత ముందని గమనించని నడిరేయికి రేపుందా

గతి తోచని గమనానికి గమ్యం అంటూ ఉందా

వలపేదో వలవేస్తుంది వయసేమో అటు తోస్తుంది

గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే ఋజువేముంది

సుడిలో పడు ప్రతి నావా చెబుతున్నది వినలేదా

చరణం : 2

పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్త్తుందా

ప్రతిపూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా

మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా

కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా

కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని

అని తిరగేశాయా చరిత పుటలు వెను చూడక ఉరికే వెతలు

తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు

ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత


చిత్రం : కొత్తబంగారులోకం (2008)

రచన : సిరివెన్నెల

సంగీతం : మిక్కీ జె.మేయర్

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం