Wednesday, March 30, 2011

Indira (1996) - 1

పాట - 1
పల్లవి :

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరు నిదురపోరే

చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం

కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే

అంత చేదా మరీ వేణుగానం

కళ్ళు మేలుకుంటె కాలమాగుతుందా భారమైన మనసా

ఆ... పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాదా ఈ ఏకాంతవేళ

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరు నిదురపోరే

చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం

సమగపా పమపమా గరిగారిసానిసమగపా పమపమా

సమగపా పమపమా గరిగారిసాని సమగపా పమపమా

గమదదమ నినిద సరిని సా నిదప

గమదదమ నినిద సరిని సాని దపమగ

చరణం :

ఎటో పోయేటి నీలిమేఘం వర్షం చిలికి వెళ్ళదా

సరిగరిగ గపమగ

ఏదో అంటుంది కోయిల పాట రాగం ఆలకించదా

సరిగరిగ గరి గదమగ

అన్ని వైపులా మధువనం... పూలు పూయదా అనుక్షణం

అణువణువునా జీవితం... అందజేయదా అమృతం

లాలీ లాలి అను రాగం సాగుతుంటె ఎవరు నిదురపోరే

చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం

కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే

అంత చేదా మరీ వేణుగానం


చిత్రం : ఇందిర (1996)

రచన : సిరివెన్నెల

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

గానం : హరిణి / హరిహరన్

No comments:

Post a Comment