Friday, March 18, 2011

Gajula kishtayya (1975) - 1

పాట - 1
కె.వి.మహదేవన్
పల్లవి :

రారయ్యా పోయినవాళ్ళు

ఎవరయ్యా ఉండే వాళ్ళు

నవ్వు మరచి నన్ను మరచి

ఎందుకు కన్నీళ్ళు ఇలా ఎన్నాళ్ళూ

రారయ్యా పోయినవాళ్ళు

చరణం : 1

తొలిసారి చూశాను నీ కళ్లను

అవి చిలికాయి నవ్వుల వెన్నెలను

తొలిసారి చూశాను నీ కళ్లను

అవి చిలికాయి నవ్వుల వెన్నెలను

నిలువునా పులకించాను కలువనై విరబూచాను

మసకేసిన చందమామను ఏమని చూస్తాను

నేనేమైపోతాను

రారయ్యా పోయినవాళ్ళు

చరణం : 2

నీ కళ్లకే కాదు కన్నీళ్లకూ

నే తోడు ఉంటాను ఏ వేళకూ

నీ మమతలే కాదు నీ కలతనూ

నే పంచుకుంటాను ప్రతి జన్మకూ

నీ మమతలే కాదు నీ కలతనూ

నే పంచుకుంటాను ప్రతి జన్మకూ

రారయ్యా పోయినవాళ్ళు

చరణం : 3

నిదురల్లె వస్తాను నీ కంటికి

చిరునవ్వు తెస్తాను నీ పెదవికి

నిదురల్లె వస్తాను నీ కంటికి

చిరునవ్వు తెస్తాను నీ పెదవికి

అమ్మల్లె లాలించి అనురాగం పలికించి

మళ్లీ నిను మనిషిని చేస్తా అన్నీ మరిపించి

నిన్నే నవ్వించి...

రారయ్యా పోయినవాళ్ళు


చిత్రం : గాజులకిష్టయ్య (1975)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : పి.సుశీల

No comments:

Post a Comment