Wednesday, March 16, 2011

Deeksha (1974) - 1

పాట - 1
పల్లవి :

మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక

చెలితో మాటలాడని వలపే పాట పాడని

వలపే పాట పాడనీ

మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక

చరణం : 1

కమలాలే నా రమణి నయనాలై విరిసే

అద్దాలే నా చెలియ చెక్కిళ్లై మెరిసే

ఆ నయనాల కమలాలలోనా

నా జిలుగు కలలు చూసుకోని

ఆ అద్దాల చెక్కిళ్ళలోన నా ముద్దులే దాచుకోనీ

మెరిసే మేఘమాలికా ఉరుములు చాలు చాలిక

చరణం : 2

మధుమాసం చెలి మోవిని దరహాసం చేసే

తెలిజాబిలి చెలిమోమున కళలారబోసే

ఆ దరహాస కిరణాలలోన

నను కలకాలం కరిగిపోని

ఆ కళల పండువెన్నెలలోనా

నా వలపులన్ని వెలిగిపోనీ

మెరిసే మేఘమాలికా...


చితం: దీక్ష (1974)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment