Thursday, March 17, 2011

Ee abbai chala manchodu (2003) - 1

పాట - 1
పల్లవి :

చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని

నమ్మడానికి ఎంత బాగుందో

బాలమిత్ర కథలో చదివా పగడపు దీవులు ఉంటాయని

నమ్మడానికి ఎంత బాగుందో

నాకోసం రెక్కల గుర్రం ఎక్కివస్తావని

పగడపు దీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావని

ఇక ఏనాటికి అక్కడే మనంఉంటామని

నమ్మడానికి ఎంత బాగుందో

నమ్మడానికి ఎంత బాగుందో

నువ్వే నాకు ముద్దొస్తావని నేనే నీకు ముద్దిస్తానని

నమ్మడానికి ఎంత బాగుందో

నమ్మడానికి ఎంత బాగుందో

చరణం : 1

వరహాల బాటలోన రతనాల తోటలోన వజ్రాల మేడలోన బంగరు గదిలోన

విరితేనెల్లో పాలల్లో తానాలాడేసి

నెలవంకల్లో వెన్నెల్లే భోంచేసి

నలు దిక్కుల్లో చుక్కల్లే చిలుకలు చుట్టేసి

చిలకే... కొరికి... దరికే జరిగి మురిపెం పెరిగి

మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ

ముద్దుల్లోన ముద్దవుతాననీ

నమ్మడానికి ఎంత బాగుందో

నమ్మడానికి ఎంత బాగుందో

చందమామ కథలో చదివా రెక్కల గుర్రాలుంటాయని

నమ్మడానికి ఎంత బాగుందో

నమ్మడానికి ఎంత బాగుందో...

చరణం : 2

ఎగిరేటి ఏనుగొచ్చి పలికేటి జింకలొచ్చి నడిచేటి చేపలొచ్చి అడవికి రమ్మనగా

ఆ కోనల్లో కొమ్మల్లో ఉయ్యాలూగేసి

ఆ కొమ్మల్లో పళ్లన్నీ రుచి చూసి

ఆ పళ్లలో మైకంతో మోహం కమ్మేసి

చలిగా గిలిగా తొలిగా త్వరగా అటుగా ఇటుగా

మరి నువ్వే నాకు ముద్దిస్తావనీ

తడి వేదాలు ముద్రిస్తావనీ

నమ్మడానికి ఎంత బాగుందో

నమ్మడానికి ఎంత బాగుందో


చిత్రం : ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)

రచన : చంద్రబోస్

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : కళ్యాణ్ మాలిక్, సునీత

No comments:

Post a Comment