Saturday, March 12, 2011

Bava maradallu (1960) - 4

పాట - 1

ఆరుద్ర

పల్లవి :

నీలి మేఘాలలో గాలి కెరటాలలో

నీవు పాడే పాట వినిపించునీ వేళ

నీలి మేఘాలలో...

చరణం : 1

ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి

ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి

అపురూపమై నిలచే నా అంతరంగాన

నీలి మేఘాలలో గాలి కెరటాలలో

నీవు పాడే పాట వినిపించునీ వేళ

నీలి మేఘాలలో...

చరణం : 2

నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు

నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు

నా హృదయ భారమునే మరపింపజేయు

నీలి మేఘాలలో...

చరణం : 3

అందుకోజాలని ఆనందమే నీవు

అందుకోజాలని ఆనందమే నీవు

ఎందుకో చేరువై దూరమౌతావు

నీలి మేఘాలలో గాలి కెరటాలలో

నీవు పాడే పాట వినిపించునీ వేళ

నీలి మేఘాలలో...


చిత్రం : బావా మరదళ్ళు (1960)

రచన : ఆరుద్ర

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : ఎస్.జానకి

----

పాట - 2

పల్లవి :

నీలి మేఘాలలో గాలి కెరటాలలో

నీవు పాడే పాట వినిపించునీ వేళ

నీలి మేఘాలలో...

చరణం : 1

ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి

ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి

అపురూపమై నిలచే నా అంతరంగాన

నీలి మేఘాలలో గాలి కెరటాలలో

నీవు పాడే పాట వినిపించునీ వేళ

నీలి మేఘాలలో...

చరణం : 2

నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు

నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు

నా హృదయ భారమునే మరపింపజేయు

నీలి మేఘాలలో...

చరణం : 3

అందుకోజాలని ఆనందమే నీవు

అందుకోజాలని ఆనందమే నీవు

ఎందుకో చేరువై దూరమౌతావు

నీలి మేఘాలలో గాలి కెరటాలలో

నీవు పాడే పాట వినిపించునీ వేళ

నీలి మేఘాలలో...


చిత్రం : బావా మరదళ్ళు (1960)

రచన : ఆరుద్ర

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : ఘంటసాల

----

పాట - 3

పల్లవి :

హృదయమా... ఓ బేల హృదయమా...

ఒకేసారిగా నీకింత సంతోషమా

హృదయమా...

చరణం : 1

తీయని ఊహలు హాయిగా నీలో మరల చిగీర్చే సుమా

పూచిన పూవులు నోచిన నోములు కాచి ఫలించు సుమా

అవి కాచి ఫలించు సుమా

హృదయమా... ఓ బేల హృదయమా...

మనసు తెలుపగా నీకింత మోమోటమా

హృదయమా...

చరణం : 2

తీగెలు సడలిన సితార తాను తిరిగి మ్రోగె సుమా

తిరిగి మ్రోగె సుమా

మ్రోగిన పాటే మోహనమై అనురాగము నించె సుమా

అనురాగము నించె సుమా

హృదయమా... ఓ బేల హృదయమా...

ఒకేసారిగా నీకింత సంతోషమా

హృదయమా...

చరణం : 3

అందరాని ఆ చందమామ నీ చేతికి అందె సుమా

చేతికి అందె సుమా

చందమామ నీ చేతులలోనే బందీయగును సుమా

ఇక బందీయగును సుమా

హృదయమా... ఓ బేల హృదయమా...

ఒకేసారిగా నీకింత సంతోషమా

హృదయమా...


చిత్రం : బావా మరదళ్ళు (1960)

రచన : ఆరుద్ర

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : ఘంటసాల, పి.సుశీల

----

పాట - 4

పల్లవి :

ముక్కోటి దే వతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు

ముక్కోటి దే వతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు

ఎక్కడున్నాగాని దిక్కువారేకదా

చిక్కులను విడదీసి దరిజేర్చలేరా

ముక్కోటి దే వతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు

చరణం : 1

ఆలి ఎడబాటెపుడు అనుభవించెడువాడు

అలమేలుమంగపతి అవనిలో ఒకడే

ఏడుకొండలవాడు ఎల్లవేళలయందు

దోగాడు బాలునికి తోడునీడౌతాడు

ముక్కోటి దే వతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు

చరణం : 2

నెల్లూరిసీమలో చల్లంగ శయనించు

శ్రీరంగనాయకా ఆనందదాయకా

తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు

దయచేయుమా నీవు క్షణము ఎడబాయకా...

ముక్కోటి దే వతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు

చరణం : 3

ఎల్లలోకాలకు తల్లివయి నీవుండ

పిల్లవానికి ఇంక తల్లిప్రేమ కొరత

బరువాయె బ్రతుకు చెఱువాయె కన్నీరు

బరువాయె బ్రతుకు చెఱువాయె కన్నీరు

కరుణించి కాపాడు మా కనకదుర్గా...

ముక్కోటి దే వతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు

చరణం : 4

గోపన్నవలె వగచు ఆపన్నులను గాచి

బాధలను తీర్చేటి భద్రాద్రివాసా...

బాధలను తీర్చేటి భద్రాద్రివాసా...

నిన్ను నమ్మిన కోర్కె నెరవేరునయ్యా

చిన్నారి బాలునకు శ్రీరామర క్ష...

ముక్కోటి దే వతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు

చరణం : 5

బాలప్రహ్లాదుని లాలించి బ్రోచిన

నారసింహుని కన్నా వేరు దైవము లేడు

అంతు తెలియగరాని ఆవేదనలుగలిగే

అంతు తెలియగరాని ఆవేదనలుగలిగే

చింతలను తొలగించు సింహాచలేశా...

ముక్కోటి దే వతలు ఒక్కటైనారు

చక్కన్ని పాపను ఇక్కడుంచారు


చిత్రం : బావామరదళ్ళు (1960)

రచన : ఆరుద్ర

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : ఘంటసాల

No comments:

Post a Comment