Saturday, March 12, 2011

Bava bavamaridi (1993) - 1

పాట - 1

పల్లవి :

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో

కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో

తట్టుకో తడై తమాషా

ఇచ్చుకో ఒడే మజాగా

లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే

సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది

నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో

కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో

తట్టుకో తడై తమాషా

ఇచ్చుకో ఒడే మజాగా

చరణం : 1

ఒంపుల్లో సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు

ఒళ్లంటుకుంటేనే జల్లంటు పుట్టేను వయ్యారి గంధాలు

నీ గాలికే పైట మేఘాలు కమ్మేను సాయంత్ర వేళల్లో

నీ చూపుకే ఊపు ఉయ్యూరు దాటేను ఉల్లాస లీలల్లో

ఉత్తమైన గుమ్మందమూ ఒత్తుకున్న వడ్డాణమూ గంటకొట్టే కౌగిళ్ళలోనా

మువ్వగోపాల రమ్మంది ముద్దిచ్చి పొమ్మంది మువ్వెన్నడో

జివ్వుజివ్వంటు నా గువ్వ గూడెక్కి కూసింది నీ కోనలో నీరెండలో నీ గుండెలో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో

కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో

తట్టుకో తడై తమాషా

ఇచ్చుకో ఒడే మజాగా

చరణం : 2

చిట్టెమ్మ బుగ్గల్లో పిట్టమ్మలాడేను నీ గోరువంకల్లో

చీరంటు సిగ్గుల్లో చీ పో లు రేగేను నా పూల సంతల్లో

కొండమ్మ కోనమ్మ కోలాటమాడేను నీ రూపురేఖల్లో

ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాలుచూపుల్లో

పంచదార పందిళ్లలో మంచు తేనె సందెళ్లలో పాలు పంచుకోరాదా ప్రాయం

వంగతోటెంతో బాగుంది వయ్యారి వడ్డీలు చెల్లించిపో

కొత్త కవ్వింత పుట్టించి గల్లంత చేసేసి వేడెక్కిపో వేధించుకో వేటాడుకో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో

కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో

తట్టుకో తడై తమాషా

ఇచ్చుకో ఒడే మజాగా

లేత చీకట్లో నీ ఒళ్లు శృంగార కావిళ్ళు మొయ్యాలిలే

సోకు పూరేకులా విచ్చి మారాకులేసింది

నన్నంటుకో చిన్నింటిలో జున్నంటుకో

గజ్జె ఘల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో

కట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదో

తట్టుకో తడై తమాషా

ఇచ్చుకో ఒడే మజాగా


చిత్రం : బావ బావమరిది (1993)

రచన : వేటూరి

సంగీతం : రాజ్-కోటి

గానం : ఎస్.పి.బాలు, చిత్ర

No comments:

Post a Comment