Friday, March 11, 2011

Bandipotu (1963) - 2

పాట - 1

పల్లవి :

ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే

ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే

చరణం : 1

వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు.

వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు

తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు

ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే

చరణం : 2

నను కోరి చేరినబేల దూరాన నిలిచేవే ల (2)

నీ యానతి లేకున్నచో విడలేను ఊపిరికూడా

ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే

చరణం : 3

దివి మల్లెపందిరి వేసె భువి పెళ్ళిపీటను వేసె

దివి మల్లెపందిరి వేసె భువి పెళ్ళిపీటను వేసె

నెరవెన్నెల కురిపించుచూ నెలరాజు పెండ్లిని చేసే

ఊహలు గుసగుసలాడే మన హృదయము ఊయలలూగే


చిత్రం : బందిపోటు (1963)

రచన : ఆరుద్ర

సంగీతం : ఘంటసాల

గానం : ఘంటసాల, పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

వగలరాణివి నీవే సొగసుకాడను నేనే

ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే

వగలరాణివి నీవే సొగసుకాడను నేనే

ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే

వగలరాణివి నీవే...

చరణం : 1

పిండి వెన్నెల నీకోసం పిల్లతెమ్మెర నాకోసం

పిండి వెన్నెల నీకోసం పిల్లతెమ్మెర నాకోసం

రెండు కలసిన నిండుపున్నమి రేయి మనకోసం

వగలరాణివి నీవే...

చరణం : 2

దోరవయసు చినదాన కోరచూపుల నెరజాణ

దోరవయసు చినదాన కోరచూపుల నెరజాణ

బెదురుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన

వగలరాణివి నీవే...

చరణం : 3

కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే

కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే

వరుని కౌగిట ఒరిగినంతట కరగిపోదువులే

వగలరాణివి నీవే సొగసుకాడను నేనే

ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే

వగలరాణివి నీవే...


చిత్రం : బందిపోటు (1963)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం, గానం : ఘంటసాల

No comments:

Post a Comment