Friday, March 11, 2011

Balipeetam (1975) - 1

పాట - 1
పల్లవి :

కుశలమా... నీకు కుశలమేనా?

మనసు నిలుపుకోలేక

మరీ మరీ అడిగాను అంతే... అంతే... అంతే...

కుశలమా... మీకు కుశలమేనా?

ఇన్నినాళ్ళు వదలలేక

ఏదో ఏదో వ్రాశాను అంతే... అంతే... అంతే...

కుశలమా...

చరణం : 1

చిన్న తల్లి ఏమంది?

నాన్న ముద్దు కావాలంది

పాలుగారు చెక్కిలిపైన పాపాయికి ఒకటి

తేనెలూరు పెదవులపైన దేవిగారికొకటి

ఒకటేనా...ఆ...ఒకటేనా... ఆ...

ఎన్నైనా... ఆ... ఎన్నెన్నో... ఆ...

మనసు నిలుపుకోలేక

మరీ మరీ అడిగాను అంతే... అంతే... అంతే...

కుశలమా...

చరణం : 2

పెరటిలోని పూలపాన్పు

త్వర త్వరగా రమ్మంది

పొగడ నీడ పొదరిల్లో...

దిగులు దిగులుగా ఉంది

ఎన్ని కబురులంపేనో ఎన్ని కమ్మలంపేనో

పూలగాలి రెక్కలపైనా నీలిమబ్బు పాయలపైనా

అందేనా... ఒకటైనా...

అందెనులే తొందర తెలిపెనులే

ఇన్నినాళ్ళు వదలలేక

ఏదో ఏదో వ్రాశాను అంతే... అంతే... అంతే...

కుశలమా... నీకు కుశలమేనా?

మనసు నిలుపుకోలేక

మరీ మరీ అడిగాను అంతే... అంతే... అంతే...

కుశలమా... మీకు కుశలమేనా?

ఇన్నినాళ్ళు వదలలేక

ఏదో ఏదో వ్రాశాను అంతే... అంతే... అంతే...

కుశలమా...


చిత్రం : బలిపీఠం (1975)

రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి

సంగీతం : చక్రవర్తి

గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


No comments:

Post a Comment