Friday, March 11, 2011

bandipotu dongalu (1968) - 1

పాట - 1

పల్లవి:

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా

మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...

విన్నానులే ప్రియా...

చరణం : 1

ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే

ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే

ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే...ఒదిగి ఉన్నావులే

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా

మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...

విన్నానులే ప్రియా...

చరణం : 2

వికసించి వెలిగే నీ అందము

ఒక వేయి రేకుల అరవిందము

వికసించి వెలిగే నీ అందము

ఒక వేయి రేకుల అరవిందము

కలకల నవ్వే నీ కళ్ళు కాముడు దాగిన పొదరిళ్ళు

ఆ నీలి నయనాలలో నీవే నిండి ఉన్నావులే... నిండి ఉన్నావులే

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా

మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...

విన్నానులే ప్రియా...

చరణం : 3

చిరుగాలి వీచెను వింజామర

గగనాలు వేసెను విరి ఊయల

చిరుగాలి వీచెను వింజామర

గగనాలు వేసెను విరి ఊయల

పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు

ఆ పసిడి పందిళ్ళలో మనకె పరిణ యమౌనులే... పరిణ యమౌనులే

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా

మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...

విన్నానులే ప్రియా... ఆ...


చిత్రం : బందిపోటు దొంగలు (1968)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : ఘంటసాల, పి.సుశీల


No comments:

Post a Comment