Monday, March 7, 2011

Anandam (2001) - 1

పాట - 1

పల్లవి :

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా

నిజమూ తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా

ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా

ఇదిగో ఇపుడే చూశా సరిగా

ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోన

అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసిందా కొత్తగా

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా

నిజమూ తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా

ఓ ఓ... ఓ ఓ... ఓ ఓ......

చరణం : 1

పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది

నీ జతలో ఈ సంతోషం పంచాలని పిస్తోంది

ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది

అయితే నేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది

దూరం మహ చెడ్డదని తోకం అనుకుంటుంది

కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది

నీలో నాప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది

నీతో అది చెప్పిందా ఈ జ్ఞాపకాలె నా ఊపిరైనవని

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా

నిజమూ తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా

చరణం : 2

ప్రతినిముషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది

ఎవరైనా కనిపెడతారని కంగారుగా ఉంటోంది

నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోందీ

నాక్కూడా ఈ కలవరమెపుడే పరిచయమయ్యింది

అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే

నేనే ఇక లేనట్టు నీలో కరిగించావో

ప్రేమా ఈ కొత్త స్వరమని అనుమానం కలిగించి

నువ్వే నా సందేహానికి వెచ్చనైన ఋజువియ్యయింది మరి

కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా

నిజమూ తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మవేలా

ఎదుటే ఎపుడూ తిరిగే వెలుగా

ఇదిగో ఇపుడే చూశా సరిగా

ఇన్నాళ్ళూ నేనున్నది నడిరేయి నిదురలోన

అయితే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసిందా కొత్తగా


చిత్రం : ఆనందం (2001)

రచన : సిరివెన్నెల

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

గానం : మల్లికార్జున్, సుమంగళి

No comments:

Post a Comment