Monday, March 7, 2011

Ananda nilayam (1971) - 1

పాట - 1

పల్లవి :

పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

విరితోటలో పూలెన్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే

పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

చరణం : 1

గోపాలునికెంతమంది గోపికలున్నా గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే

ఆకాశవీధిలో తారలెన్ని ఉన్నా అందాల జాబిల్లి అసలు ఒక్కడే

పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

చరణం : 2

ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే

నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను

ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే

పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

చిత్రం : ఆనంద నిలయం (1971)

రచన : ఆరుద్ర

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం : ఘంటసాల

No comments:

Post a Comment