Monday, March 7, 2011

Anand (2004) - 6

పాట - 1

పల్లవి :

యమునా తీరం సంధ్యా రాగం

యమునా తీరం సంధ్యా రాగం

నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో

నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో

యమునా తీరం సంధ్యా రాగం

నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో

నిలువగనే తేనెల్లో పూదారి ఎన్నెల్లో గోదారి మెరుపులతో

యమునా తీరం... సంధ్యా రాగం...

చరణం : 1

ప్రాప్తమనుకొ ఈ క్షణమే బ్రతుకులాగ

పండెననుకొ ఈ బ్రతుకే మనసు తీరా

శిథిలంగా విధినైనా చేసేదే ప్రేమ

హృదయంలా తననైనా మరిచేదే ప్రేమ

మరువుకుమా ఆనందం ఆనందం

ఆనందమాయేటి మనసు కథా

మరువుకుమా ఆనందం ఆనందం

ఆనందమాయేటి మనసు కథా

యమునా తీరం... సంధ్యా రాగం...

చరణం : 2

ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం

చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం

శిశిరంలో చలి మంటై రగిలెదే ప్రేమ

చిగురించే ఋతువళ్ళే విరబూసే ప్రేమ

మరువుకుమా ఆనందం ఆనందం

ఆనందమాయేటి మధుర కథా

మరువుకుమా ఆనందం ఆనందం

ఆనందమాయేటి మధుర కథా

యమునా తీరం సంధ్యా రాగం

యమునా తీరం... సంధ్యా రాగం...

చిత్రం : ఆనంద్ (2004)

రచన : వేటూరి

సంగీతం : కె.ఎం.రాధాక్రిష్ణన్

గానం : హరిహరన్, చిత్ర

----

పాట - 2

పల్లవి :

నువ్వేనా... నా నువ్వేనా

నువ్వేనా... నాకు నువ్వేనా

సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా

మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా

చేరువైనా దూరమైనా ఆనందమేనా

చేరువైనా దూరమైనా ఆనందమేనా

ఆ... ఆనందమేనా... ఆనందమేనా...

నువ్వేనా... నా నువ్వేనా

నువ్వేనా... నాకు నువ్వేనా

చరణం : 1

మేఘమల్లే సాగివచ్చి దాహమేదో పెంచుతావు

నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు

కలలేనా... కన్నీరేనా...

ఆ... తేనెటీగ లాగ కుట్టి తీపిమంట రేపుతావు

పువ్వులాంటి గుండెలోన దారమల్లే దాగుతావు

నేనేనా... నీ రూపేనా...

చేరువైనా దూరమైనా ఆనందమేనా

ఆ... ఆనందమేనా... ఆనందమేనా...

నువ్వేనా... నా నువ్వేనా

నువ్వేనా... నాకు నువ్వేనా

చరణం : 2

ఆ... కోయిలల్లే వచ్చి ఏదో కొత్తపాట నేర్పుతావు

కొమ్మగొంతులోన గుండె కొట్టుకుంటె నవ్వుతావు

ఏ రాగం... ఇది ఏ తాళం...

ఆ... మసక ఎన్నెలల్లే నీవు ఇసక తిన్నె చేరుతావు

గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు

ప్రేమంటే... నీ ప్రేమేనా...

చేరువైనా దూరమైనా ఆనందమేనా

ఆ... ఆనందమేనా... ఆనందమేనా...

నువ్వేనా... నా నువ్వేనా

నువ్వేనా... నాకు నువ్వేనా

చిత్రం : ఆనంద్ (2004)

రచన : వేటూరి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

గానం : శ్రేయా ఘోషల్, కె.ఎం.రాధాకృష్ణన్

----

పాట - 3

పల్లవి :

ఎదలో గానం పెదవే మౌనం

సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో

మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో... అలజడిలో

ఎదలో గానం పెదవే మౌనం

సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో

మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో... అలజడిలో

చరణం : 1

కట్టుకథలా ఈ మమతే కలవరింత

కాలమొకటే కలలకైనా పులకరింత

శిల కూడా చిగురించే విధి రామాయణం

విధికైనా విధిమార్చే కథ ప్రేమాయణం

మరవకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనసు కథ

మరవకుమా వేసంగి ఎండల్లో పూసేటి మల్లెల్లో మనసు కథ

ఎదలో గానం పెదవే మౌనం

సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో

మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో... అలజడిలో

చరణం : 2

శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో

శ్రీగౌరి చిగురించే సిగ్గులెన్నో

పూచే సొగసులు ఎగసిన ఊసులు

మూగే మనసులు అవి మూగవై

తడి తడి వయ్యారాలెన్నో ప్రియా ప్రియా అన్న వేళలోన శ్రీగౌరి...

ఎదలో గానం పెదవే మౌనం

సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో

మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో... అలజడిలో

ఎదలో గానం పెదవే మౌనం

సెలవన్నాయి కలలు సెలయేరైన కనులలో

మెరిసెనిలా శ్రీరంగ కావేరి సారంగ వర్ణాలలో... అలజడిలో

చిత్రం : ఆనంద్ (2004)

రచన : వేటూరి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

గానం : హరిహరన్, చిత్ర

----

పాట - 4

పల్లవి :

వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా... గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా...

వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా... గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా...

కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్

గుండెలోన దాచుకున్న గాథలెన్నో మాకున్నాయ్

తీరుస్తారా బాధ తీరుస్తారా గాలివాన లాలి పాడేస్తారా

చరణం : 1

పిల్లపాపలా వాన బుల్లిపడవలా వాన

చదువు బాధనే తీర్చి సెలవులిచ్చినా వాన

గాలివాన కబాడ్డీ వేడివేడి పకోడి

ఈడు జోడు డీ డీ డీ డీ తోడుండాలి ఓ లేడి

ఇంద్రధనస్సులో తళుకుమనే ఎన్ని రంగులో

ఇంతి సొగసులే తడిసినవి నీటి కొంగులో

శ్రావణమాసాలా జలతరంగం

జీవనరాగాలకిది ఓ మృదంగం

కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్

వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా... గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా...

చరణం : 2

కోరి వచ్చిన ఈ వాన గోరువెచ్చనై నాలోన

ముగ్గులా సిగ్గు ముసిరేస్తే ముద్దులాటిదే మురిపాలా

మెరిసే మెరిసే అందాలు తడిసే తడిసే పరువాలు

గాలివానల పందిళ్ళు కౌగిలింతల పెళ్ళిళ్ళు

నెమలి ఈకలో ఉలికిపడే ఎవరి కన్నులో

చినుకు చాటున చిటికెలతో ఎదురుచూపులో

న ల్లని మేఘాలా మెరుపులందం

తీరని దాహాలా వలపు పందెం

కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్

తీరుస్తారా బాధ తీరుస్తారా గాలివాన లాలి పాడేస్తారా

వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా... గిచ్చే గిచ్చే పిల్లగాలుల్లారా...

కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్

తీరుస్తారా బాధ తీరుస్తారా గాలివాన లాలి పాడేస్తారా

చిత్రం : ఆనంద్ (2004)

రచన : వేటూరి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

గానం : శ్రేయా ఘోషల్

----

పాట - 5

పల్లవి :

తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు

తలచీ వలచీ కలలే కనెనే మనసు

తనువున ఎన్నో తపన లు రేగే

తహ తహలోనే తకదిమి సాగే

తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు

తలచీ వలచీ కలలే కనెనే మనసు

చరణం : 1

పొద్దసలే పోక నిద్దర పోనీక

ఎవ్వరిదో కేక ఎద లోతుల దాకా

భారమాయె యవ్వనం బోరు కొట్టే జీవితం

రగిలేటి విరహాన రాధల్లె నేనున్నా

నీ గాలి సోకేనా నా ఊపిరాడేనా

తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు

తలచీ వలచీ కలలే కనెనే మనసు

అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే

అది ఒక ఇదిలే ఇదిలే ఏదోలే

చరణం : 2

నాకొద్దీ దూరం వెన్నెల జాగారం

బాత్రూం సంగీతం లేత ఈడు ఏకాంతం

కోపమొచ్చె నామీద తాపమాయె నీ మీద

దేహాలు రెండైనా ప్రాణాలు నీవేగా

విసిగించు పరువాన విధిలేక పడివున్నా

తెలిసీ తెలిసీ వలలో పడెనే వయసు

తలచీ వలచీ కలలే కనెనే మనసు

చిత్రం : ఆనంద్ (2004)

రచన : వేటూరి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

గానం : శ్రేయాఘోషల్, బృందం

----

పాట - 6

పల్లవి :

చారుమతీ ఐలవ్యూ...చంద్రముఖీ ఐలవ్యూ...

చారుమతీ ఐలవ్యూ... చంద్రముఖీ ఐలవ్‌యూ...

రూపవతీ ఐలవ్‌యూ... నేను నీకే ఏక లవ్వూ

a e i o u అన్నీ ఐలవ్‌యూ లవ్‌యూ లవ్‌యూ

చారుమతీ ఐలవ్‌యూ... చంద్రముఖీ ఐలవ్‌యూ...

చారుమతీ ఐలవ్‌యూ... చంద్రముఖీ ఐలవ్‌యూ...

చరణం : 1

ఎదనే నీవు నిదరే లేపి ఎదురైనావు తొలి ప్రేమల్లే

కునుకే రాని ఉలుకై తీపి కలవై నావు ఎద నీడల్లే

అడిగా నిన్ను వరమిస్తావా

విడిగా నన్ను వదిలేస్తావా

yes ఆర్ no వా yes ఆర్ no వా

చారుమతీ ఐలవ్‌యూ... చంద్రముఖీ ఐలవ్‌యూ...

చారుమతీ ఐలవ్‌యూ... చంద్రముఖీ ఐలవ్‌యూ...

చరణం : 2

ఫ్లవరై విచ్చి కలరే ఇచ్చి విక సించావు తొలి ఊహల్లో

చెలిమైవచ్చి చెలిగా నచ్చి ఉసిగొల్పావు నడిజాముల్లో

క్షణమే నేను యుగమౌతావా

సఖివై నాకు సగమౌతావా

yes ఆర్ no వా yes ఆర్ no వా

చారుమతీ ఐలవ్‌యూ... చంద్రముఖీ ఐలవ్‌యూ...

చారుమతీ ఐలవ్‌యూ... చంద్రముఖీ ఐలవ్‌యూ...

రూపవతీ ఐలవ్‌యూ... నేను నీకే ఏక లవ్వూ

a e i o u అన్నీ ఐలవ్‌యూ లవ్‌యూ లవ్‌యూ

చిత్రం : ఆనంద్ (2004)

రచన : వేటూరి

సంగీతం : కె.ఎం.రాధాకృష్ణన్

గానం : లక్కీ అలీ

No comments:

Post a Comment