Saturday, March 5, 2011

Alluri sitharamaraju (1974) - 2

పాట - 1

పల్లవి :

ఓహో... హో... ఓహోహో... ఓ... ఓ....

తెలుగువీర లేవరా... ఆ... దీక్షబూని సాగరా.... ఆ...

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

చరణం : 1

దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ...

నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దురా... ఆ...

దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా... ఆ...

నీతిలేని శాసనాలు నేటి నుండి రద్దురా... ఆ...

నిదురవద్దు... బెదరవద్దు...నిదురవద్దు... బెదరవద్దు...

నింగి నీకు హద్దురా... నింగి నీకు హద్దురా...

చరణం : 2

ఓ... ఎవడువాడు ఎచటివాడు ఎవడువాడు ఎచటివాడు

ఇటు వచ్చిన తెల్లవాడు... ఇటు వచ్చిన తెల్లవాడు

కండబలం కొండఫలం

కబళించే దుండగీడు... కబళించే దుండగీడు

మానధనం ప్రాణధనం

దోచుకునే దొంగవాడు... దోచుకునే దొంగవాడు

ఎవడువాడు ఎచటివాడు

ఇటు వచ్చిన తెల్లవాడు

తగిన శాస్తి చెయ్యరా... తగిన శాస్తి చెయ్యరా

తరిమి తరిమి కొట్టరా... తరిమి తరిమి కొట్టరా

తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా

దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా

చరణం : 3

ఈ దేశం ఈ రాజ్యం... ఈ దేశం ఈ రాజ్యం

నాదే అని చాటించి... నాదే అని చాటించి

ప్రతిమనిషి తొడలుగొట్టి

శృంఖలాలు పగులగొట్టి... శృంఖలాలు పగులగొట్టి

చురకత్తులు పదునుబట్టి

తుది సమరం మొదలుబెట్టి... తుది సమరం మొదలుబెట్టి

సింహాలై గర్జించాలి... సింహాలై గర్జించాలి

సంహారం సాగించాలి... సంహారం సాగించాలి

వందేమాతరం... వందేమాతరం...

వందేమాతరం... వందేమాతరం...

ఓ... ఓ... స్వాతంత్య్రవీరుడా! స్వరాజ్యభానుడా!

అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా!

స్వాతంత్య్రవీరుడా! స్వరాజ్యభానుడా!

అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా!

అందుకో మా పూజలందుకో రాజా

అందుకో మా పూజలందుకో రాజా

అల్లూరి సీతారామరాజా! అల్లూరి సీతారామరాజా!

ఓ... తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా!

మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా!

తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా!

మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా!

త్యాగాలే వరిస్తాం కష్టాలే భరిస్తాం

త్యాగాలే వరిస్తాం కష్టాలే భరిస్తాం

నిశ్చయముగ... నిర్భయముగ... నీ వెంటనె నడుస్తాం...

నిశ్చయముగ... నిర్భయముగ... నీ వెంటనె నడుస్తాం...

నీ వెంటనె నడుస్తాం...


చిత్రం : అల్లూరి సీతారామరాజు (1974)

రచన : శ్రీశ్రీ

సంగీతం : పి.ఆదినారాయణరావు

గానం : ఘంటసాల, రామకృష్ణ, బృందం

----

పాట - 2

పల్లవి :

వస్తాడు నా రాజు ఈ రోజు

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నల కెరటాలపైన

కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నల కెరటాలపైన

తేలి వస్తాడు నా రోజు ఈ రోజు

చరణం : 1

వేల తారకల నయునాలతో నీలాకాశం తిలకించేను

వేల తారకల నయునాలతో నీలాకాశం తిలకించేను

అతని చల్లని అడుగుల సవ్వడి... వీచే గాలి వినిపించేను

అతని పావన పాద ధూళికై అవని... అణువణువు కలవరించేను

అతని రాకకై అంతరంగమే... పాలసంద్రమై పరవశించేను

పాలసంద్రమై పరవశించేను...

వస్తాడు నా రాజు ఈ రోజు

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

చరణం : 2

వెన్నెలలెంతగా విరిసిన గాని... చంద్రుణ్ణి విడిపోలేవు

కెరటాలెంతగా పొంగినగాని... కడలిని విడిపోలేవు

కలసిన ఆత్మల అనుబంధాలు... ఏ జన్మకూ విడిపోలేవులే

తనువులు వేరైనా దారులు వేరైనా

తనువులు వేరైనా దారులు వేరైనా

ఆ బంధాలే నిలిచేనులే... ఆ బంధాలే నిలిచేనులే

వస్తాడు నా రాజు ఈ రోజు

రానే వస్తాడు నెలరాజు ఈ రోజు

కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నల కెరటాలపైన

వస్తాడు నా రాజు ఈ రోజు


చిత్రం : అల్లూరి సీతారామరాజు(1974)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : పి.ఆదినారాయణరావు

గానం : పి.సుశీల

No comments:

Post a Comment