Saturday, March 5, 2011

Aithe (2003) - 1

పల్లవి :

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే

తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే

అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎపుడూ ఓ వానా నువ్వొస్తానంటే

నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలీబాబా ఉంటే

అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లావుద్దీన్ జీని ఉంటే

చూపదా వురి ఆ మాయాదీపం మన ఫేటే ప్లైటయ్యే రన్ వే

చరణం : 1

ఓ.. ఓ...నడిరాత్రే వస్తావే స్వప్నమా

పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా

ఉరికినె ఉరిస్తే న్యాయమా

సరదాగ నిజమైతే నష్టమా

మోనాలిసా మొహమ్మీదే నిలుస్తావా

ఓ చిరునామా ఇలా రావా

ఓ... ఓ...ఓ... ఓ...ఓ....

చరణం : 2

వేకువనే మురిపించే ఆశలు

వెనువెంటనే అంతా నిట్టూర్పులూ

లోకంలో లేవా ఏ రంగులు

నలుపొకటే చూపాలా కన్నులూ

ఇలాగేనా ప్రతీరోజు ఎలాగైనా

ఏదో రోజు మనదై రాదా

ఓ.. ఓ... ఓ.. ఓ... ఓ....

చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే

తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే


చిత్రం : ఐతే (2003)

రచన : సిరివెన్నెల

సంగీతం : కళ్యాణి మాలిక్

గానం: ఎం.ఎం.కీరవాణి

(గమనిక : ఈ సినిమాలో ఉన్న ఒకే పాట ఇది)

No comments:

Post a Comment