Saturday, March 5, 2011

Alludugaru (1990) - 1

పాట - 1

పల్లవి :

ముద్దబంతి నవ్వులో మూగబాసలు

ముద్దబంతి నవ్వులో మూగబాసలు

మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు

ముద్దబంతి నవ్వులో మూగబాసలు

మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు

చదువుకునే మనసుంటే ఓ కోయిలా

చదువుకునే మనసుంటే ఓ కోయిలా

మధుమాసమే అవుతుంది అన్నివేళలా...

ముద్దబంతి నవ్వులో మూగబాసలు

చరణం: 1

బంధమంటు ఎరుగని బాటసారికి

అనుబంధమై వచ్చింది ఒక దేవతా...

అనుబంధమై వచ్చింది ఒక దేవతా...

ఇంతచోటులోనే అంత మనసు ఉంచి

ఇంతచోటులోనే అంత మనసు ఉంచి

నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా...

ముద్దబంతి నవ్వులో మూగబాసలు

మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు

ముద్దబంతి నవ్వులో మూగబాసలు

చరణం : 2

అందమైన తొలిరేయి స్వాగతానికి

మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు...

ఎదుటనైన పడలేని గడ్డిపూవును

గుడిలోనికి రమ్మంది ఈ దైవము

మాటనోచుకోని ఒక పేదరాలిని

మాటనోచుకోని ఒక పేదరాలిని

నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా...

ముద్దబంతి నవ్వులో మూగబాసలు

మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు

చదువుకునే మనసుంటే ఓ కోయిలా

మధుమాసమే అవుతుంది అన్నివేళలా...

ముద్దబంతి నవ్వులో మూగబాసలు

మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు

ముద్దబంతి నవ్వులో మూగబాసలు


చిత్రం : అల్లుడుగారు (1990)

రచన : గురుచరణ్

సంగీతం : కె.వి.మహదేవన్

గానం : జేసుదాసు, చిత్ర

No comments:

Post a Comment