Saturday, March 5, 2011

Allari priyudu (1993) - 2

పాట - 1

పల్లవి :

అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు

అహో తన పల్లవి పాడే చల్లని రోజు

ఇదే ఇదే కుహూస్వరాల కానుక

మరో వసంత గీతిక జనించు రోజు

అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు

అహో తన పల్లవి పాడే చల్లని రోజు

చరణం : 1

మాటా పలుకు తెలియనిది మాటున ఉండే మూగమది

కమ్మని తలుపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది

రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది

శ్రుతిలయలెరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది

రుతువుల రంగులు మార్చేది

కల్పన కలిగిన మది భావం

బ్రతుకును పాటగా మలిచేది

మనసున కదిలిన మృదునాదం

కలవని దిక్కులు కలిపేదినింగిని నేలకు దింపేది

తనే కదా వారధి క్షణాలకే సారథి మనస్సనేది

అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు

అహో తన పల్లవి పాడే చల్లని రోజు

చరణం : 2

చూపులకెన్నడు దొర క నిది రంగూరూపూ లేని మది

రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినది

వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళ గల నిండుమది

కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది

చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం

కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం

అడగని వరములు కురిపించి అమృతవర్షిణి అనిపించే

అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది

అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు

అహో తన పల్లవి పాడే చల్లని రోజు

ఇదే ఇదే కుహూ స్వరాల కానుక

మరో వసంత గీతిక జనించు రోజు


చిత్రం : అల్లరిప్రియుడు (1993)

రచన : సిరివెన్నెల

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : ఎస్.పి.బాలు, చిత్ర

----

పాట - 2

పల్లవి :

ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా

ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా

గమ్యం తెలియని పయనమా

ప్రేమకు పట్టిన గ్రహణమా

తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా

చరణం : 1

ప్రేమ కవితా గానమా

నా ప్రాణమున్నది శ్రుతి లేక

గేయమే ఎద గాయమైనది వలపు చితిని రగిలించగా

తీగచాటున రాగమా ఈ దేహమున్నది జత లేక

దాహమార ని స్నేహమై ఎద శిథిల శిశిరమై మారగా

ఓ హృదయమా... ఇది సాధ్యమా...

రెండుగ గుండే చీలునా ఇంకా ఎందుకు శోధన

రెండుగ గుండే చీలునా ఇంకా ఎందుకు శోధన

తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా

చరణం : 2

ప్రేమసాగర మధనమే జరిగింది గుండెలో ఈవేళ

రాగమన్నది త్యాగమైనది చివరికెవరికీ అమృతం

తీరమెరుగని కెరటమై చెలరేగు మనసులో ఈవేళ

అశ్రుధారలే అక్షరాలుగా అనువదించెనా జీవితం

ఓ ప్రాణమా... ఇది న్యాయమా...

రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా

రాగం అంటే త్యాగమా వలపుకు ఫలితం శూన్యమా

తెలుపుమా తెలుపుమా తెలుపుమా

ప్రణయమా నీపేరేమిటి ప్రళయమా


చిత్రం : అల్లరి ప్రియుడు (1993)

రచన : వెన్నెలకంటి

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

No comments:

Post a Comment