Saturday, March 5, 2011

Amarasilpi jakkanna (1964) - 2

పాట - 1

పల్లవి :

నిలువుమా!

నిలువుమా నిలువుమా నీలవేణి

నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ

నిలువుమా నిలువుమా నీలవేణి

చరణం : 1

అడుగడున ఆడే లే నడుము సొంపులా

అడుగడున ఆడే లే నడుము సొంపులా

తడబడే అడుగుల నటనల మురిపింపుల

తడబడే అడుగుల నటనల మురిపింపుల

సడిసేయక ఊరించే...

సడిసేయక ఊరించే వయ్యారపు ఒంపుల

కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపులా

నడచిరా సడచిరా నాగవేణి

నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ

నిలువుమా నిలువుమా నీలవేణి

చరణం : 2

అద్దములో నీ చెలువు తిలకింపకు ప్రేయసీ

అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి

అలిగేవు నీ సాటి చెలిగా తలబోసి

నా ఊర్వశి రావే రావేయని పిలువునా

నా ఊర్వశి రావే రావేయని పిలువునా

ఆ సుందరి నెరనీకు నీగోటికి సమమౌనా

రాచెలీ నినుమదీ దాచుకోని

రాచెలీ నినుమదీ దాచుకోని

నీ కనుల నీలినీడ నా మనసూ నిదురపోనీ

నిలువుమా నిలువుమా నీలవేణి


చిత్రం : అమరశిల్పి జక్కన్న (1964)

రచన : సముద్రాల సీనియర్

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : ఘంటసాల, పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

ఓహోహో.... ఓ... ఓ... ఓ...

ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో...

ఈ బండల మాటున... ఏ గుండెలుమ్రోగెనో...ఓ...

ఈ నల్లని రాలలో...

చరణం : 1

పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి

పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి

మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి

ఈ నల్లని రాలలో...

చరణం : 2

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు

కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు

ఉలి అలికిడి విన్నంతనే...

ఉలి అలికిడి విన్నంతనే గలగలవుని పొంగిపొరలు

ఈ నల్లని రాలలో...

చరణం : 3

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును

పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును

జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును

ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో...

ఈ బండల మాటున... ఏ గుండెలు మ్రోగెనో... ఓ...

ఈ నల్లని రాలలో...


చిత్రం : అమరశిల్పి జక్కన్న (1964)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : ఘంటసాల

2 comments: