Saturday, March 5, 2011

akbar saleem anarkali (1978) - 2

పాట - 1

పల్లవి :

తానే మేలి ముసుగు తీసి

ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను

తానే మేలి ముసుగు తీసి

ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను

నవ్వే ఆ నవ్వుతోనే మెలమెల్లగా

పిడుగులే రువ్వుతుంటే ఏం చేయను

చరణం : 1

నేను అనుకొంటినా మరి కలగంటినా

నాలో అనురాగమేదో మ్రోగేనని

ఆ ఆ ఆ... నేను అనుకొంటినా మరి కలగంటినా

నాలో అనురాగమేదో మ్రోగేనని

అందమే నన్ను చేరి కొనగోటితో

అందమే నన్ను చేరి కొనగోటితో

గుండెలో మీటుతుంటే ఏం చేయను

తానే మేలి ముసుగు తీసి

ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను

చరణం : 2

చేత మధు పాత్ర లేదు... చేత మధు పాత్ర లేదు

నాకిప్పుడు... ఐనా అంటారు నన్నే... తాగేనని

కన్నులే పొంగిపోయే మధుపాత్రలై

కన్నులే పొంగిపోయే మధుపాత్రలై

కైపులో ముంచుతుంటే ఏం చేయను

తానే మేలి ముసుగు తీసి

ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను

చరణం : 3

నేను ఫిరదౌసినా మరి కాళిదాసునా కాని అంటారు నన్నే కవిరాజనీ

ఆ ఆ ఆ... నేను ఫిరదౌసినా మరి కాళిదాసునా కాని అంటారు నన్నే కవిరాజనీ

ప్రేయసీ మధుర రూపం మహాకావ్యమై

ప్రేయసీ మధుర రూపం మహాకావ్యమై

ఊహలో పొంగుతుంటే ఏం చేయను

తానే మేలి ముసుగు తీసి

ఒక జవ్వని పువ్వులా నవ్వుతుంటే ఏం చేయను

లలా లాలలలాల...


చిత్రం : అక్బర్ సలీం అనార్కలి (1978)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : సి.రామచంద్ర

గానం : మహమ్మద్ రఫీ, పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

తారలెంతగా మెరిసేను... తారలెంతగా మెరిసేను

చందురుని కోసంచందురుని కోసం

రేయి ఎంతగా మురిసేను... రేయి ఎంతగా మురిసేను

దినకరుని కోసం దినకరుని కోసం

తారలెంతగా మెరిసేను...

చరణం : 1

చిగురుటాకులే చేతులుగా మిసిమిరేకులే పెదవులుగా

చిగురుటాకులే చేతులుగా మిసిమిరేకులే పెదవులుగా

పరిమళాలే పిలుపులుగా మకరందాలే వలపులుగా

పూవులెంతగా వేచేను... పూవులెంతగా వేచేను

తుమ్మెదల కోసం... తుమ్మెదల కోసం

తారలెంతగా మెరిసేను...

చరణం : 2

నింగి రంగులే కన్నుల దాచి కడలి పొంగులే ఎదలో దాచి

నింగి రంగులే కన్నుల దాచి కడలి పొంగులే ఎదలో దాచి

గులాబి కళలే బుగ్గల దాచి మెరుపుల అలలే మేనిలో దాచి

పరువాలెంతగ వేచేను... పరువాలెంతగ వేచేను

పయ్యెదల కోసం... పయ్యెదల కోసం

తారలెంతగా మెరిసేను చందురుని కోసం


చిత్రం : అక్బర్ సలీం అనార్కలి (1978)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : సి.రామచంద్ర

గానం : మహమ్మద్ రఫీ

No comments:

Post a Comment