Tuesday, March 8, 2011

Aathmeeyulu (1969) - 2

పాట - 1
పల్లవి :

ఆ... ఆ... ఆ... ఆ... ఆ.....

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే

కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే

చరణం : 1

సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది

సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది

పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే

చరణం : 2

కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందుకోరేను

కెరటాల వెలుగు చెంగలువా నెలరాజు పొందుకోరేను

అందాల తారలై మెరిసి చెలికాని చెంత చేరేను

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే

చరణం : 3

రాధలోని అనురాగమంతా మాధవునిదేలే

వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే

కలనైన కనని ఆనందం ఇలలోన విరిసె ఈనాడే

మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నొ చెలరేగే

చితం : ఆత్మీయులు (1969)

రచన : దాశరథి

సంగీతం : ఎస్.రాజేశ్వరరావు

గానం : పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను

బంగారు కాంతులేవో నేడే తొంగి చూసేను

అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను

చరణం : 1

తోడు నీడ నీవై లాలించే అన్నయ్యా

తోడు నీడ నీవై లాలించే అన్నయ్యా

తల్లితండ్రి నీవై పాలించే అన్నయ్యా

నీకన్న వేరే పెన్నిధి లేనెలేదు

నా పూర్వపుణ్యాల రూపమే నీవు

అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను

చరణం : 2

రతనాల సుగుణాల రాశివి నీవే

అన్నయ్య నయనాల ఆశవు నీవే

రతనాల సుగుణాల రాశివి నీవే

అన్నయ్య నయనాల ఆశవు నీవే

నీవు మెట్టిన ఇల్లు నిత్యము విలసిల్లు

నీ నవ్వు సిరులొల్కు ముత్యాలజల్లు

అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను

బంగారు కాంతులేవో నేడే తొంగి చూసేను

అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను

చరణం : 3

మా అన్నయ్య మనసే సిరిమల్లె పువ్వేను

మా అన్నయ్య మనసే సిరిమల్లె పువ్వేను

చెల్లి కంట తడి వుంటే తల్లడిల్లేను

నీ పూజలే నన్ను నడిపించు తల్లీ

శతకోటి విజయాలు సాధింతు చెల్లీ

అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను

బంగారు కాంతులేవో నేడే తొంగి చూసేను

అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను

చిత్రం : ఆత్మీయులు (1969)

రచన : డా.సి.నారాయణరెడ్డి

సంగీతం : ఎస్.రాజేశ్వరరావు

గానం : ఘంటసాల, పి.సుశీల

No comments:

Post a Comment