Tuesday, March 8, 2011

Atta okinti kodale (1958) - 1

పాట - 1
పల్లవి :

జోడు గుళ్ళ పిస్తోలు ఠా

నేను ఆడీ తప్పని వాణ్ణీ జీఁహా...

నేను ఆడీ తప్పని వాణ్ణీ జీఁహా...

చరణం : 1

హద్దు మీరు వారు శిక్షింపబడుదురు

బుద్ధిమంతులెపుడు రక్షింపబడుదురు

జోడు గుళ్ళ పిస్తోలు ఠా

నేను ఆడీ తప్పని వాణ్ణీ జీఁహా...

చరణం : 2

ఆఫీసరు భార్యననే అహం కూడదు

అధికారం చెలాయిస్తే ఇంక చెల్లదు

తొండ ముదిరితే ఊసరవెల్లి అత్తా

హజం ముదిరితే హళ్ళికి హళ్ళి

జోడు గుళ్ళ పిస్తోలు ఠా

నేను ఆడీ తప్పని వాణ్ణీ జీఁహా...

చరణం : 3

కాకి పిల్ల కాకికి కడు ముద్దు

అది అందుచేత కాకూడదు మొద్దు

ఎవరి గొప్ప వాళ్ల వద్ద ఆగకున్నచో

ఎవరి గొప్ప వాళ్ల వద్ద ఆగకున్నచో

అత్తా... దేహశుద్ధి కొండొకచో జరుగుట కద్దు

జోడు గుళ్ళ పిస్తోలు ఠా

నేను ఆడీ తప్పని వాణ్ణీ జీఁహా...

చరణం : 4

నోరు మంచిదైతేనే ఊరు మంచిది

పోరు నష్టమూ ఎపుడూ పొందు లాభము

ఇది కోర్టుకెక్కితే అంతా అభాసు అత్తా

నీ జోరు తగ్గకుంటేనూ కొంప కళాసు

జోడు గుళ్ళ పిస్తోలు ఠా

నేను ఆడీ తప్పని వాణ్ణీ జీఁహా...

నేను ఆడీ తప్పని వాణ్ణీ జీఁహా...జీఁహా...


చిత్రం : అత్తా ఒకింటి కోడలే (1958)

రచన : ఆరుద్ర

సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు

గానం :ఘంటసాల

No comments:

Post a Comment