Monday, March 14, 2011

Bhaktha prahlada (1931) - 1

పాట - 1
చందాల కేశవదాసు
పరితాప భారంబు భరియింప తరమా

కటకటనే విధి గడువంగ జాలుదు

పతి ఆజ్ఞను దాటగలనా

పుత్రుని కాపాడగలనా...

పరితాప భారంబు భరియింప తరమా

ఈ విషము నేనెటులను

తనయుని త్రావింపగలను?

ధర్మము కాపాడుదునా?

తనయుని కావగగలనా?...

పరితాప భారంబు భరియింప తరమా

కటకటనే విధి గడువంగ జాలుదు

పతి ఆజ్ఞను దాటగలనా

పుత్రుని కాపాడగలనా...

పరితాప భారంబు భరియింప తరమా


చిత్రం : భక్తప్రహ్లాద (1931)

రచన : చందాల కేశవదాసు (తొలి తెలుగు సినీ కవి)

సంగీతం : హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి

గానం : సురభి కమలాబాయి

No comments:

Post a Comment