Monday, March 14, 2011

Bharya bhartalu (1961) - 3

పాట - 1
పల్లవి :

మధురం మధురం ఈ సమయం

ఇక జీవితమే ఆనందమయం

మధురం మధురం ఈ సమయం

చల్లని పున్నమి వెన్నెలలో ఓ...

ఎన్నడు వీడని కౌగిలిలో ఆ...

చల్లని పున్నమి వెన్నెలలో ఓ...

ఎన్నడు వీడని కౌగిలిలో ఆ...

కన్నుల వలపు కాంతుల మెరయగ

మధురం మధురం ఈ సమయం

ఇక జీవితమే ఆనందమయం

మధురం మధురం ఈ సమయం

చరణం : 1

కరగిపోయె పెను చీకటి పొరలూ...

కరగిపోయె పెను చీకటి పొరలూ...

తొలగిపోయె అనుమానపు తెరలు

తొలగిపోయె అనుమానపు తెరలు

పరిమళించె అనురాగపు విరులు

పరిమళించె అనురాగపు విరులు

అలరెనె మనసు నందనవనముగ

మధురం మధురం ఈ సమయం

ఇక జీవితమే ఆనందమయం

మధురం మధురం ఈ సమయం

చరణం : 2

సఫలమాయె మన తీయని కలలూ...

సఫలమాయె మన తీయని కలలూ...

జగము నిండె నవజీవన కళలు

జగము నిండె నవజీవన కళలు

పొంగిపొరలే మన కోర్కెల అలలు

పొంగిపొరలే మన కోర్కెల అలలు

భావియే వెలిగె పూవుల బాటగా

మధురం మధురం ఈ సమయం

ఇక జీవితమే ఆనందమయం

మధురం మధురం ఈ సమయం... ఆ... ఆ...


చిత్రం : భార్యాభర్తలు (1961)

రచన : శ్రీశ్రీ

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : ఘంటసాల, పి.సుశీల

----

పాట - 2

పల్లవి :

జోరుగా హుషారుగా షికారు పోదమా

హాయి హాయిగా తీయతీయగా...

జోరుగా హుషారుగా షికారు పోదమా

హాయి హాయిగా తీయతీయగా...

చరణం : 1

... బాలనీ వయ్యారమెంచి మరులుకొంటినే

చాల ప్రేమ పాఠములను చదువుకుంటినే... ...

బాలనీ వయ్యారమెంచి మరులుకొంటినే

చాల ప్రేమ పాఠములను చదువుకుంటినే

మరువనంటినే మరువనంటినే... ...

జోరుగా హుషారుగా షికారు పోదమా

హాయి హాయిగా తీయతీయగా...

చరణం : 2

నీ వన్నెచిన్నెలన్ని చూసి వలచినాడనే

వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే... ...

వన్నెచిన్నెలన్ని చూసి వలచినాడనే

వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే

కలసిరాగదే కలసిరాగదే... ...

జోరుగా హుషారుగా షికారు పోదమా

హాయి హాయిగా తీయతీయగా...

చరణం : 3

నా... కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే

కనులు తెరిచి ఎదుట నిన్నె కాంచినాడనే... ...

కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే

కనులు తెరిచి ఎదుట నిన్నె కాంచినాడనే

వరించినాడనే వరించనాడనే... ...

జోరుగా హుషారుగా షికారు పోదమా

హాయి హాయిగా తీయతీయగా...

జోరుగా... జోరుగా...


చిత్రం : భార్యాభర్తలు (1961)

రచన : శ్రీశ్రీ

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : ఘంటసాల

----

పాట - 3

పల్లవి :

ఏమని పాడెదనో ఈవేళా...

ఏమని పాడెదనో ఈవేళా...

మానసవీణ మౌనముగా నిదురించిన వేళ

ఏమని పాడెదనో ఈవేళా...

చరణం : 1

జగమే మరచి హృదయం విపంచి

జగమే మరచి హృదయం విపంచి

గారడిగా వినువీధి చరించి

గారడిగా వినువీధి చరించి

కలత నిదురలో కాంచిన కలలే గాలిమేడలై కూలిన వేళ

ఏమని పాడెదనో ఈవేళా...

చరణం : 2

వనసీమలలో హాయిగ ఆడే

వనసీమలలో హాయిగ ఆడే

రా చిలుకా నిను రాణిని చేసే

రా చిలుకా నిను రాణిని చేసే

పసిడి తీగలా పంజర మిదిగో పలుక వేమని పిలిచే వేళ

ఏమని పాడెదనో ఈవేళా...

మానసవీణ మౌనముగా నిదురించిన వేళ

ఏమని పాడెదనో... ఓ... ఓ...


చిత్రం : భార్యాభర్తలు (1961)

రచన : శ్రీశ్రీ

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గానం : పి.సుశీల

No comments:

Post a Comment