Monday, March 14, 2011

Bharateeyudu (1996) - 1

పాట - 1
పల్లవి:

తందానానె తానానె ఆనందమే... తందానానె తానానె ఆనందమే

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లూ ఈ లోకంలో కన్నీరింక చెల్లు

చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే..

అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే

సీతాకోకా చిలుకకు చీరలెందుకు..

అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బులెందుకంట

చరణం : 1

అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం

అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం

మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం

అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం

బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం... చెలియా

వయుసుడిగే స్వగతంలో అనుబంధం ఆనందమానందం

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లూ ఈ లోకంలో కన్నీరింక చెల్లు

చరణం : 2

నీ శ్వాసను నేనైతే నా వయుసే ఆనందం

మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం

చలి గుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం

నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం

అందం ఓ.. ఆనందం బంధం పరమానందం చెలియా

ఇతరులకై కనుజారే కన్నీరే ఆనందమానందం

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లూ ఈ లోకంలో కన్నీరింక చెల్లు

చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే..

అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే

సీతాకోకా చిలుకకు చీరలెందుకు..

అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బులెందుకంట

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే

భూలోకమే ఆనందానికి ఇల్లూ ఈ లోకంలో కన్నీరింక చెల్లు

చిత్రం : భారతీయుడు (1996)

రచన : భువనచంద్ర

సంగీతం : ఎ.ఆర్.రెహమాన్

గానం : కె.జె.ఏసుదాసు

No comments:

Post a Comment